BJP: అవినాష్‌కు ఎక్కువ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలి... లేదంటే ఏమైనా జరగొచ్చన్న బీజేపీ నేత

ABN, First Publish Date - 2023-03-10T11:19:01+05:30

ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ అంటే భయం పట్టుకున్నట్టుందని బీజేపీ రాష్ట్ర ఉప అధ్యక్షుడు విష్ణు కుమార్ రాజు అన్నారు.

BJP: అవినాష్‌కు ఎక్కువ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలి... లేదంటే ఏమైనా జరగొచ్చన్న బీజేపీ నేత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

విశాఖపట్నం: ఎంపీ అవినాష్ రెడ్డి (MP Avinash Reddy) కి సీబీఐ (CBI) అంటే భయం పట్టుకున్నట్టుందని బీజేపీ రాష్ట్ర ఉప అధ్యక్షుడు విష్ణు కుమార్ రాజు (BJP State Vice President Vishnu Kumar Raju) అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... భాస్కర్ రెడ్డి, అవినాష్‌కు ఎక్కువ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. జరగకూడనివి జరిగి దీని పక్కదారి పట్టించే అవకాశాలు ఉన్నాయని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారని... రోడ్డు ప్రమాదం జరిగినా జరగవచ్చంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు పూర్తయ్య వరకు ప్రత్యేక సెక్యూరిటీ ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరారు. సీబీఐ క్రెడిబిలిటీ పెరిగిందని తెలిపారు. విశాఖలో పెట్టుకోండి సదస్సు అద్భుతంగా నిర్వహించాలని తానే చెప్పానన్నారు. ఆ ముసుగులో భూములు కొట్టే దాని ప్రయత్నం చేస్తున్నారన్న విషయాన్ని చెప్పానని ఆయన తెలిపారు.

ఈ ఒప్పందాల వెనుక క్విడ్ ప్రోకో ఉందో లేదో తేల్చాల్సిన అవసరం ఉందన్నారు. వైసీపీ నేతలకు డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కోవడం తప్పితే మరేం తెలియదని వ్యాఖ్యలు చేశారు. 32 మంది ఎమ్మెల్సీలు ఉన్నారని.. 22 మందికి మొన్న ఇచ్చారని... ఇందులో ఒక్కరికైనా మాట్లాడగలిగే దమ్ము ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. 151 మంది ఎమ్మెల్యేలు, రాష్ట్రంలో అత్యంత అవినీతి ప్రభుత్వం మనదే అని చెప్పగలరా అని నిలదీశారు. డిక్టేటర్ షిప్‌తో జరుగుతున్న ఆంధ్ర రాష్ట్ర పరిపాలనపై కేంద్రం ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని సూచించారు. టిడ్కో ఇల్లు నిర్మించిన కాంట్రాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం లేదని విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు.

Updated Date - 2023-03-10T11:19:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising