ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

GVL: ఉదయనిధి స్టాలిన్‌ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ ఆగ్రహం

ABN, First Publish Date - 2023-09-05T11:08:33+05:30

తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ బచ్చాగాళ్లు సనాతన ధర్మంపై వ్యాఖ్యలు చేశారని.. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇది అనాలోచన వ్యాఖ్య కాదని.. ఈ వ్యాఖ్యాలు భారత ప్రజలు మనోభావాలు దెబ్బ తీశాయన్నారు.

విశాఖపట్నం: తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ (Tamilnadu Minister Udayanidhi Stalin) వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ (BJP MP GVL)
ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ బచ్చాగాళ్లు సనాతన ధర్మంపై వ్యాఖ్యలు చేశారని.. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇది అనాలోచన వ్యాఖ్య కాదని.. ఈ వ్యాఖ్యాలు భారత ప్రజలు మనోభావాలు దెబ్బ తీశాయన్నారు. జి 20 సదస్సు, చంద్రయాన్ విజయం సాధించిన నేపథ్యంలో కొంత మంది బచ్చాగాళ్లు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇది డీఎంకే (DMK) విధానం కాదని... యాంటీ ఇండియా అలయెన్స్ విధానమని చెప్పుకొచ్చారు. యాంటీ ఇండియా అలయెన్స్ గెలిచే సత్తా లేదని... అందుకే మోదీని (PM Narendra Modi), భారత్ దేశాన్ని విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయ్ నిధి వ్యాఖ్యలను కాంగ్రెస్ సమర్ధించడం దారుణమన్నారు. తప్పుడు వ్యాఖ్యలు చేసిన ఉదయనిధి కాదు... కాంగ్రెస్ (Congress) పార్టీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. డీఎంకే నాయకులకు ఎందుకు దుర్బుద్ధి కలిగి ఉందో అని అన్నారు. సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు మా భూమి... మా దేశం కార్యక్రమం నిర్వహిస్తామని... ఈ కార్యక్రమంలో 5 ప్రతిజ్ఞలు చేస్తామని ఎంపీ జీవీఎల్ పేర్కొన్నారు.

Updated Date - 2023-09-05T11:08:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising