ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Purandeswari: వైసీపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది

ABN, First Publish Date - 2023-11-25T17:17:24+05:30

ప్రభుత్వ విధి విధానాలు అవినీతిని ప్రశ్నిస్తే వాటికి సమాధానం చెప్పటం మానేసి నాపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ నాయకుల ఆరోపణలు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు.

అనకాపల్లి: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం (Ycp Government) నాలుగున్నర ఏళ్లుగా అవినీతిలో కూరుకుపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి (Purandeswari) ఆరోపించారు. పురందేశ్వరి మీడియాతో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో 400 మండలాల్లో కరువు పరిస్థితులు ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వం 100 మండలాలనే కరువు ప్రాంతాలుగా గుర్తించడం అన్యాయం. ప్రజావేదిక కూల్చడంతో ప్రారంభించి.. గుళ్ళు, గోపురాలు, మూల విగ్రహాలు కూలదీసి పరిపాలన సాగిస్తున్నారు. విశాఖకు రైల్వే జోన్ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఇప్పటివరకు స్థలాన్ని కేటాయించకపోవడం దారుణం. రాష్ట్రంలోని నిరుపేదల కోసం 25 లక్షల గృహాలను కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తే ఇప్పటివరకు 20 శాతం పూర్తి చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. రాష్ట్రంలో విధ్వంసకర పాలన నడుస్తుంది. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించిన వారిపై అక్రమ ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి వేధిస్తున్నారు. మిగిలిన కరువు మండలాలపై కనీసం మంత్రివర్గ సమావేశం కూడా నిర్వహించక పోవడం ప్రభుత్వ నిర్లక్ష్యనికి నిదర్శనం. ప్రభుత్వ విధి విధానాలు అవినీతిని ప్రశ్నిస్తే వాటికి సమాధానం చెప్పటం మానేసి నాపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ నాయకుల ఆరోపణలు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు.’’ అని పురందేశ్వరి పేర్కొన్నారు.

Updated Date - 2023-11-25T17:19:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising