ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TDP: విశాఖలో టీడీపీ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

ABN, First Publish Date - 2023-03-10T12:36:07+05:30

విశాఖ జిల్లా పరిషత్ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

విశాఖపట్నం: విశాఖ జిల్లా పరిషత్ కార్యాలయంలో టీడీపీ (TDP) ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం (MLC Election Campaign) నిర్వహించింది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు (Ganta Srinivas Rao), ఎమ్మెల్యే వెలగపూడి, టీడీపీ నేత పల్లా శ్రీనివాస్, శ్రీ భరత్ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు సాధారణవి కావని... పట్టభద్రుల ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవని తెలిపారు. మూడు జిల్లాల్లో ఎంతో మంది పట్టభధ్రులు ఉన్నారో.. అందరూ కలిసి ఓటు వేయాలని కోరారు. పట్టభద్రుల మౌనం మంచిది కాదని తెలిపారు. ఉద్యోగులు నిరుద్యోగులు ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడుతున్నారన్నారు. ప్రభుత్వానికి చెంప పెట్టు విధంగా ఈ ఎన్నికలు జరగాలని గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు.

ఎమ్మెల్యే వెలగపూడి మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికలు విద్యావంతుల ఎన్నికలన్నారు. మూడు జిల్లాల్లో విద్యా వంతులు ఉన్నారని తెలిపారు. వీరంతా ఆలోచించి ఓటు వేయాలని.... నిరుద్యోగులు నేడు చాలా సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు.

శ్రీ భరత్ మాట్లాడుతూ... ఎమ్మెల్సీ ఎన్నికలు ఓటింగ్ శాతం పెరగాలన్నారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు ఓటు వేయాలని కోరారు. ఓటు వేయకుండా ఉండకూడదని.. పట్టభద్రుల హక్కుల కోసమే ఈ ఓటు అని అన్నారు. ప్రభుత్వం ఉద్యోగుల పట్ల మోసం చేసిందని భరత్ మండిపడ్డారు.

Updated Date - 2023-03-10T12:36:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising