ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ganta Srinivasrao: వైసీపీ నేతలు ఇప్పుడు తూర్పు తిరిగి దండం పెట్టుకోవాల్సిందే

ABN, First Publish Date - 2023-09-15T14:49:50+05:30

టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు అరెస్టు రిమాండ్ తరలించడం నిరసిస్తూ గత వారం రోజులుగా ఆందోళన చేపడుతున్నామని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు.

విశాఖపట్నం: టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) అరెస్టు రిమాండ్ తరలించడం నిరసిస్తూ గత వారం రోజులుగా ఆందోళన చేపడుతున్నామని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు (Former Minister Ganta Srinivas rao) అన్నారు. శుక్రవారం గంటా ఇంటి వద్ద కళ్ళకు గంతులు కట్టుకొని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్న సైమన్ సెంటర్ ద్వారా అనేకమంది ఉపాధి లభించింది అద్భుతంగా ఉందని ఏయూ వైస్ ఛాన్స్లర్ రిపోర్టులోనే చెప్పారన్నారు. పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) తీసుకున్న నిర్ణయం సరైన సమయంలో సరైన నిర్ణయంగా భావిస్తున్నామన్నారు. ఈ నిర్ణయంతో జనసేన, టీడీపీ సంబరాలు చేసుకుంటున్నారని... దీంతో వైసీపీ రాదని విషయం ఖరార్ అయిందన్నారు. జనసేన, టీడీపీ కలిస్తే సౌండ్ లేకుండా రౌండ్ అయిపోతుందని వైసీపీకి తెలుసన్నారు. రేపు కాగడాల ప్రదర్శన సంయుక్తమే చేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు. రాజకీయ దురుద్దేశం రాజకీయ కక్షతోనే చంద్రబాబును జైల్లో పెట్టాలని తప్పుడు కేసు పెట్టారన్నారు. చంద్రబాబు అరెస్టు జగన్ స్వయంగా ఆయన మరణ శాసనాన్ని ఆయన రాసుకోవడమే అని వ్యాఖ్యలు చేశారు. మర్డర్లు, మానభంగాలు, కూనికోర్లు ఉన్న జైల్లో ఆయన్ని పెట్టడం దారుణమన్నారు. బీజేపీ హస్తం ఉందా?.. లేదా? అనేది కేవలం ఊహాగానాలు మాత్రమే దీనిపై ఇంతవరకు వాళ్ళు ఎవరు మాట్లాడలేదు వాస్తవం ఉందా లేదని తెలియదన్నారు. చంద్రబాబు, పవన్‌తో వైసీపీలో వణుకుపుట్టిందని.. అలయన్స్ బ్రేక్ చేయడానికి ప్రయత్నాలు చేశారన్నారు. వైసీపీ నేతలు ఇప్పుడు తూర్పు తిరిగి దండం పెట్టడం తప్పితే మరేం లేదని గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-09-15T14:49:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising