Ganta Srinivas: ఏపీని నెం.1లో నిలుపుతామంటే ఏంటో అనుకున్నాం.. ఇలా అనుకోలేదు జగనన్నా..
ABN, Publish Date - Dec 14 , 2023 | 01:19 PM
Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డిపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రతీ రోజు ఏదో ఒక అంశంపై ట్విట్టర్ వేదికగా సీఎంపై గంటా విరుచుకుపడుతూనే ఉన్నారు. తాజాగా మరోసారి జగన్‌పై మాజీ మంత్రి ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ను నెం.1లో నిలుపుతాను అంటే ఏంటో అనుకున్నామని.. నిరుద్యోగంలో అని గ్రహించలేక పోయాము జగనన్న అంటూ ఎద్దేవా చేశారు.
విశాఖపట్నం: ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డిపై (CM Jaganmohan reddy) మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు (Former Minister Ganta Srinivas reddy) విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రతీ రోజు ఏదో ఒక అంశంపై ట్విట్టర్ వేదికగా సీఎంపై గంటా విరుచుకుపడుతూనే ఉన్నారు. తాజాగా మరోసారి జగన్‌పై మాజీ మంత్రి ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ను నెం.1లో నిలుపుతాను అంటే ఏంటో అనుకున్నామని.. నిరుద్యోగంలో అని గ్రహించలేక పోయాము జగనన్న అంటూ ఎద్దేవా చేశారు. చరిత్రలో బీహార్‌ను కూడా వెనక్కి నెట్టేసి మరీ పట్టభద్రులను నిరుద్యోగంలో 24%తో మొదటి స్థానంలో నిలిపిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు.
జాతీయ సరాసరినే 13.4 శాతంగా ఉంటే జాతీయ సరాసరి కన్నా 11 శాతం అధికంగా రాష్ట్రంలో ఉన్న గ్రాడ్యుయేట్స్‌ను నిరుద్యోగంలోకి నెట్టేశారన్నారు. జాతీయ సగటు కంటే నిరుద్యోగంలో 12 రాష్ట్రాలు పైన ఉంటే వాటిల్లో ఏపీనే అగ్రస్థానంలో నిలిపారన్నారు. కేవలం కక్షలు కార్పణ్యాలపైన దృష్టి పెట్టి రాష్ట్రాన్ని అట్టడుగుకు నెట్టేశారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని ఒక్క నిరుద్యోగంలోనే కాదు అన్ని రంగాలలో పాతాళంలోకి నెట్టేశారన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగులు అధైర్య పడాల్సిన అవసరం లేదని.. 2024లో చంద్రబాబు నాయుడు అనే బ్రాండ్‌తో రాష్ట్రానికి పూర్వ వైభవం రావడం తథ్యమని స్పష్టం చేశారు. యువత ఓటు అనే ఆయుధంతో ఈ అరాచక ప్రభుత్వానికి చరమగీతం పాడి, రాష్ట్ర భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ట్వీట్ చేశారు.
Updated Date - Dec 14 , 2023 | 01:19 PM