AP News: విశాఖ ఆర్కే బీచ్‌లో నేవీ డే విన్యాసాలు
ABN, First Publish Date - 2023-12-10T16:55:04+05:30
నగరంలోని ఆర్కే బీచ్‌లో నేవీ డే విన్యాసాలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్ హాజరయ్యారు.
విశాఖపట్నం: నగరంలోని ఆర్కే బీచ్‌లో నేవీ డే విన్యాసాలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్ హాజరయ్యారు. భారత్–పాక్ మధ్య జరిగిన యుద్ధంలో విజయానికి ప్రతీకగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 4వ తేదీన నేవీ డే ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే మిచౌంగ్ తుఫాన్ కారణంగా 10వ తేదీకి నేవీ డే ఉత్సవాలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో ఆర్కే బీచ్‌లో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. నేవీ యుద్ధనౌకలు, ఫైటర్ జైట్లు, జలాంతర్గాములు, హెలికాప్టర్‌లతో సిబ్బంది విన్యాసాలు చేస్తున్నారు. ఈ ఉత్సవాలను చూడడానికి ప్రజలు భారీగా తరలి వచ్చారు. దీంతో ఆర్కే బీచ్ జనసందోహంగా కనిపిస్తోంది.
Updated Date - 2023-12-10T16:55:05+05:30 IST