ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Anitha: భువనేశ్వరిని అంతమాట అంటారా?...బుర్ర, బుద్ధి ఉండే మాట్లాడుతున్నారా?

ABN, First Publish Date - 2023-10-17T12:43:30+05:30

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిపై ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి అనుచిత వ్యాఖ్యాలపై తెలుగు మహిళ అధ్యక్షురాలు అనిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం ఉదయం పార్టీ కార్యాలయంలో ముందు నారాయణ స్వామి ఫోటోలను తెలుగు మహిళలు దగ్ధం చేశారరు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ.. సజ్జల కాళ్ళ దగ్గర ఉండే దళిత మంత్రి.. అమ్మలాంటి భువనేశ్వరిపై మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

విశాఖపట్నం: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) సతీమణి నారా భువనేశ్వరిపై (Nara Bhuvaneshwari) ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి (Deputy CM Narayanaswamy) అనుచిత వ్యాఖ్యాలపై తెలుగు మహిళ అధ్యక్షురాలు అనిత (TDP Leader Anitha) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం ఉదయం పార్టీ కార్యాలయంలో ముందు నారాయణ స్వామి ఫోటోలను తెలుగు మహిళలు దగ్ధం చేశారరు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ.. సజ్జల కాళ్ళ దగ్గర ఉండే దళిత మంత్రి.. అమ్మలాంటి భువనేశ్వరిపై మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ‘‘భువనేశ్వరి పుడ్‌లో విషం పెతుతుందని అంటారా?.. బుర్ర, బుద్ధి ఉండే మాట్లాడుతున్నారా?.. చంద్రబాబు ఆరోగ్యంపై ఊర కుక్కలు మాట్లాడుతున్నాయి. భువనేశ్వరి గురించి.. మీకు ఏమి తెలుసు అని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు?. ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఎంతో మందికి భువనేశ్వరి ఎన్నో సేవలు అందిస్తున్నారు.. ఈ విషయం మీకు తెలుసా?. ఎపుడూ ఆమె రాజకీయాలలోకి రాలేదు.. తన భర్తను అక్రమంగా అరెస్టు చేశారు కాబట్టి బయటకు వచ్చారు’’ అని అనిత పేర్కొన్నారు.

Updated Date - 2023-10-17T12:43:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising