ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Visakha గ్లోబల్ ఇన్వెస్టర్‌ సమ్మిట్.. అయోమయంలో పోలీసులు.. కారణమేంటంటే..

ABN, First Publish Date - 2023-03-03T09:43:09+05:30

శాఖ వేదికగా ఈరోజు గ్లోబల్ ఇన్వర్టర్ సమ్మిట్ జరుగనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

విశాఖపట్నం: విశాఖ వేదికగా ఈరోజు గ్లోబల్ ఇన్వర్టర్ సమ్మిట్ (Visakhapatnam Global Investor Summit) జరుగనుంది. ఇందు కోసం ప్రభుత్వ (AP Government) యంత్రాంగం భారీగా ఏర్పాట్లు చేసింది. అయితే ఈరోజు నుంచి జరిగే సమ్మిట్‌కు పెట్టుబడులతో సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. దీంతో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు భారీ సంఖ్యలో జనాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో పోలీస్‌ శాఖ, అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023లో పాల్గొనే ప్రైవేట్ ఆర్గనైజేషన్ డెలిగేట్స్‌కు ఈరోజు మధ్యాహ్నం 3:00 గంటల నుంచి సదస్సులో ప్రవేశానికి అనుమితిస్తున్నట్లు ప్రకటించారు.

అలాగే స్టూడెంట్ డెలిగేట్స్‌కు రేపు అనగా మార్చి 4న మధ్యాహ్నం 2:00 గంటల నుంచి సదస్సులో ప్రవేశించేందుకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు నగర కమిషనర్ శ్రీకాంత్ ప్రెస్‌నోట్‌ను విడుదల చేశారు. అయితే ఈ సదస్సుకు వచ్చే వారిలో ఎవరు పెట్టుబడిదారులు కాదో తెలియని అయోమయ పరిస్థితిలో పోలీసులు, అధికారులు ఉన్నారు. ఎవరిని బయట ఆపితే ఎలాంటి ఇబ్బందులు వస్తాయో అంటూ పోలీసులు ఇబ్బందులు పడుతున్నారు.

రూ.2లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా...

కాగా.. విశాఖపట్నంలో జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సును ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా తీసుకుంది. నేడు, రేపు జరిగే ఈ సదస్సు కోసం ప్రభుత్వం పెద్దఎత్తున ఏర్పాట్లు చేసింది. కనీసం రూ.2లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు 25 దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి ప్రకటించారు. ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజీ (AU Engineering College) మైదానంలోని 50 ఎకరాల్లో కేవలం వాహనాల పార్కింగ్‌కే 25 ఎకరాలు కేటాయించారు. మిగిలిన 25 ఎకరాల్లో ఐదు జర్మన్‌ హ్యాంగర్లు వేశారు. 4వేల మంది కూర్చునేందుకు వీలుగా ఓ పెద్ద హాలు, 50 మంది ఆశీనులు కావడానికి వేదికను సిద్ధం చేశారు.

నాలుగు వేల మందికి భోజనాల కోసం మరో హాలు, సీఎం కోసం ప్రత్యేకంగా ఒక లాంజ్‌, చర్చలు, సమావేశాలకు మరో రెండు హాళ్లు కేటాయించారు. అతిథుల కోసం నగరంలోని స్టార్‌ హోటళ్లలో 750కు పైగా సూట్‌లు, రూమ్‌లు బుక్‌ చేశారు. ఇవికాకుండా మరో వెయ్యి గదులు తీసుకున్నారు. విదేశీ అతిథుల వ్యక్తిగత అవసరాల కోసం కార్వాన్లు కూడా రప్పించారు. అన్ని దేశాల వారికి ఇష్టమైన ఆహార పదార్థాలు అందించేందుకు పేరొందిన హోటళ్ల చెఫ్‌లతో వంటకాలు చేయిస్తున్నారు. వీరందరికీ 3న సాయంత్రం ఆర్‌కే బీచ్‌లోని ఎంజీఎం పార్కులో డిన్నర్‌ ఏర్పాటు చేశారు. కాగా, ఇన్వెస్టర్ల సదస్సుతో పాటు నెలాఖరులో జి-20 సదస్సు కూడా నగరంలో నిర్వహించనున్న నేపథ్యంలో అతిథులను ఆకట్టుకునేలా రూ.100కోట్లతో సుందరీకరణ పనులు చేపట్టారు.

Updated Date - 2023-03-03T09:44:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!