Share News

అంగన్‌వాడీ కేంద్రానికి కుళ్లిన కోడిగుడ్లు

ABN , First Publish Date - 2023-11-03T23:50:41+05:30 IST

సీతంపేట ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలోని పెదరామ సెక్టార్‌ కారంకొత్తగూడెం అంగన్‌వాడీ కేంద్రానికి శుక్రవారం కుళ్లిన కోడిగుడ్లు సరఫరా చేసినట్టు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

అంగన్‌వాడీ కేంద్రానికి కుళ్లిన కోడిగుడ్లు
కుళ్లిన కోడిగుడ్లు

సీతంపేట, నవంబరు 3: సీతంపేట ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలోని పెదరామ సెక్టార్‌ కారంకొత్తగూడెం అంగన్‌వాడీ కేంద్రానికి శుక్రవారం కుళ్లిన కోడిగుడ్లు సరఫరా చేసినట్టు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ కేంద్రంలో 30 మంది వరకు బాలింతలు, గర్భిణులు, చిన్నారులు ఉన్నారు. అయితే, వీరిలో కొందరికి గుడ్లు పంపిణీ చేశారు. వాటిని ఇంటి వద్ద చూడగా కుళ్లిపోయి ఉండడంతో లబోదిబోమ న్నారు. ఈ విషయమై సీడీపీవో పీవో రంగలక్ష్మి వివరణ కోరగా.. కుళ్లిన కోడిగుడ్లు స్థానంలో కొత్తగా గుడ్లు సరఫరా చేస్తామని తెలిపారు.

Updated Date - 2023-11-03T23:50:42+05:30 IST