వైసీపీ పాలనకు చరమగీతం పాడాలి
ABN , First Publish Date - 2023-02-03T00:11:22+05:30 IST
రానున్న ఎన్నికల్లో వైసీపీ పాలనకు చరమగీతం పాడాలని టీడీపీ పాలకొండ నియోజకవర్గ ఇన్‌చార్జి నిమ్మక జయకృష్ణ పిలుపునిచ్చారు.

పాలకొండ: రానున్న ఎన్నికల్లో వైసీపీ పాలనకు చరమగీతం పాడాలని టీడీపీ పాలకొండ నియోజకవర్గ ఇన్‌చార్జి నిమ్మక జయకృష్ణ పిలుపునిచ్చారు. గురువారం పాలకొండ నగరపంచాయతీ పరిధిలోని నాగవంశపువీధి జంక్షన్ వద్ద ఇదేమి ఖర్మ మన రాష్ర్టానికి కార్య క్రమం నిర్వహించారు.తొలుత ర్యాలీ చేశారు. అనంతరం తొమ్మిది, పది వార్డుల్లో ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై కరప త్రాలు అందజేశారు. అనంతరం జయకృష్ణ మాట్లాడుతూ రానురాను రాష్ట్రంలో దాష్టిక పాలన ఎక్కువైపోయిందన్నారు. ప్రశ్నించేవారిపై కక్షసాధింపునకు పాల్పడు తున్నారని ఆరోపించారు. అడ్డుగోలు జీవోలు తెచ్చి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తు న్నారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబును సీఎంను చేయాలని జయ కృష్ణ కోరారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు గంటా సంతోష్‌కుమార్, వెన్నపు శ్రీనివాసరావు, సుంకరి అనీల్‌దత్, ఆనాపు జయవరాజు, అంపోలు శ్రీనివాసరావు, అడపా బాబ్జీ పాల్గొన్నారు.