BJP: బీజేపీ నేత సంచలన కామెంట్స్.. రాహుల్, ప్రియాంక అలానే గెలిచారా...
ABN , Publish Date - Apr 11 , 2025 | 01:50 PM
బీజేపీ సీనియర్ నేత, శాసనమండలి సభ్యుడు సీటీ రవి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈవీఎంలపై కాంగ్రెస్ నేతలు తరచూ విమర్శలు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. రాహుల్, ప్రియాంక అలానే గెలిచారా... అంటూ వ్యాఖ్యానించారు.

బెంగళూరు: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్‌లు(ఈవీఎం)లతో ఎన్నికల్లో మోసం చేశారని ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జునఖర్గే(AICC President Mallikarjun Kharge) చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత, ఎమ్మెల్సీ సీటీ రవి(CT Ravi) తీవ్రంగా స్పందించారు. ఈమేరకు గురువారం ఎక్స్ ద్వారా పలు ప్రశ్నలు సంధించారు. ఈవీఎంలు మహామోసమంటూ వ్యాఖ్యానిస్తున్న ఖర్గే కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ వార్తను కూడా చదవండి: Minister: వేసవిలో విద్యుత్ కోతలుండవ్..
యద్భావం తధ్భవతీ అనే సామెతలాగా మీ అల్లుడు రాధాకృష్ణ, కాంగ్రెస్ అగ్రనేత్రి ప్రియాంకగాంధీ, అధినాయకుడు రాహుల్‌గాందీ కూడా అలానే మోసంతోనే గెలిచారా అని ప్రశ్నించారు. తమిళనాడు(Tamilnadu)లో డీఎంకే, కేరళలో కమ్యూనిస్టులు, పశ్చిమబెంగాల్‌లో టీఎంసీ, కర్ణాటకలో కాంగ్రెస్‌లు ఈవీఎంల ద్వారానే మోసం చేశారా అంటూ నిలదీశారు. ఐఎన్‌డీఐఏ కూటమి పార్టీలు విజయానికి అదే కారణమని చెప్పగలరా అంటూ ప్రశ్నించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
గ్యాస్ సిలిండర్ ధర తగ్గించాలి
Read Latest Telangana News and National News