ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chandrababu: జీవో 1 పై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం: చంద్రబాబు

ABN, First Publish Date - 2023-05-12T16:18:41+05:30

జీవో 1 పై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ప్రకటించారు. అంతిమంగా అంబేడ్కర్ (Ambedkar) రాజ్యాంగానిదే విజయమని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: జీవో 1 పై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ప్రకటించారు. అంతిమంగా అంబేడ్కర్ (Ambedkar) రాజ్యాంగానిదే విజయమని, సీఎం జగన్ (CM Jagan) నియంతృత్వానిది కాదని పేర్కొన్నారు. జగన్ లాంటి నాయకులు వస్తారనే నాడు ఊహించి రాజ్యాంగంలో పౌరుల ప్రాథమిక హక్కులకు రక్షణ కల్పించారని చంద్రబాబు గుర్తుచేశారు. రాష్ట్రంలో సభలు, రోడ్‌షోలు, ర్యాలీలపై ఆంక్షలు విధిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం.1 ను తీసుకువచ్చింది. ఈ జీవోను సీపీఐ నేత రామకృష్ణ (CPI leader Ramakrishna) సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. రామకృష్ణ తరపున లాయర్‌ అశ్వినీకుమార్‌ వాదనలు వినిపించారు. రోడ్‌ షోలను కట్టడి చేసేలా జీవో ఉందని, ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే జీవో తెచ్చారని, పోలీస్‌ యాక్ట్‌ 30కు భిన్నంగా జీవో నెం.1 జారీ చేశారని న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువైపు వాదనలు విన్న అనంతరం హైకోర్టు ఈ మేరకు జీవో నెం.1ను కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రాథమిక హక్కులకు విఘాతంగా ఉందని, రోడ్ షోలను కట్టడి చేసేలా జీవో ఉందన్న పిటిషన్ల న్యాయవాది వాదనలతో న్యాయస్థానం ఏకీభవిస్తూ ఆ జీవోను కొట్టి వేస్తూ సంచలన తీర్పు ఇచ్చింది.

Updated Date - 2023-05-12T16:18:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising