డాక్టర్‌ అంబేడ్కర్‌ విగ్రహం ధ్వంసం

ABN , First Publish Date - 2023-04-16T00:28:39+05:30 IST

డాక్టర్‌ అంబేడ్కర్‌ విగ్రహం ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించి అరెస్టు చేయాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. శనివారం ఏలూరు జిల్లా నిడమర్రు మండలం పెదనిం డ్రకొలను ఉన్నత పాఠశాల వద్ద ఆందోళన చేపట్టారు.

డాక్టర్‌ అంబేడ్కర్‌ విగ్రహం ధ్వంసం
దళిత సంఘాల నాయకుల ధర్నా

పెదనిండ్రకొలనులో దళిత సంఘాల నాయకుల ధర్నా

డీఎస్పీ హామీతో ఆందోళన విరమణ

నిడమర్రు, ఏప్రిల్‌ 15 : డాక్టర్‌ అంబేడ్కర్‌ విగ్రహం ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించి అరెస్టు చేయాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. శనివారం ఏలూరు జిల్లా నిడమర్రు మండలం పెదనిం డ్రకొలను ఉన్నత పాఠశాల వద్ద ఆందోళన చేపట్టారు. వివరాలివి.. స్థానిక యువకులు ఈ నెల 12వ తేదీన అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా పాఠశాల ఆవరణలో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈనెల 14న అంబేడ్కర్‌ జయంతి ఉత్సవాలు ముగిసిన అనంతరం కొంతమంది దుండగులు శుక్రవారం అర్ధరా త్రి విగ్రహాన్ని దిమ్మెనుంచి పెకిలించి ఎత్తుకు పోయినట్టు స్థానికులు చెబుతున్నారు. శనివారం పాఠశాలకు వచ్చిన సిబ్బంది విషయం తెలుసు కుని స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసలకు సమచారం తెలిపారు. ఈలోపు స్థానికులు పెద్దఎత్తున పాఠశాల ఆవరణ వద్దకు చేరుకోని ధర్నాకు సిద్ధమ య్యారు. పాఠశాలలో టెన్త్‌ పరీక్షలు నిర్వహిస్తున్నందున పోలీసులు అనుమతించలేదు. పాఠశాలకు ఆవరణకు దూరంగా వంతెన వంతెన యువ కులు, దళిత సంఘాల జిల్లా నాయకులు శాంతియుతంగా ధర్నా చేశారు. ఈలోపు ఏలూరు నుంచి క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌, టెక్నికల్‌ సపోర్టు టీం వచ్చి ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఏలూరు డీఎస్పీ పైడేశ్వరరావు ఘటన స్థలాన్ని పరిశీలించి స్థానికులతో చర్చలు జరిపారు. ఘటనకు కారకులైన వారిని త్వరలో అరెస్ట్‌ చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. తొలుత స్థానిక జడ్పీటీసీ కోడే కాశీ, సర్పంచ్‌ ముగ్గళ్ల యాకోబు, జనసేన ఉంగుటూరు నియోజకవర్గ ఇన్‌చార్జి పత్సమట్ల ధర్మరాజు దళిత సంఘాల నాయకులను కలసి మద్దతు తెలిపారు. దళిత సంఘాల నాయకులు నల్లిరాజేష్‌, సిర్రా భరత్‌, ఏళ్ల సంజీవరావు, నేకూరి ఆశ్వీరాదం, దన్ను రవిప్రకాష్‌, ఓగిరాల బాబూరావు, కోన జోసఫ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-04-16T00:28:39+05:30 IST