Arvind Kejriwal: ట్రంప్‌ను మించిన సెక్యూరిటీతో ధ్యాన కేంద్రానికి కేజ్రీవాల్
ABN , Publish Date - Mar 05 , 2025 | 03:05 PM
అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ రాష్ట్రం హోషియార్‌పూర్‌లోని "విపశ్యన'' ధాన్య కేంద్రంలో బుధవారం నుంచి పదిరోజులు పాటు పాల్గొంటున్నారు. తాజాగా ఆయన ట్రిప్ సైతం రాజకీయ విమర్శలకు దారితీసింది.

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఇటీవల బహిరంగంగా ఎక్కువగా కనిపించడం లేదు. ప్రస్తుతం ఆయన పంజాబ్ రాష్ట్రం హోషియార్‌పూర్‌లోని "విపశ్యన'' ధాన్య కేంద్రంలో బుధవారం నుంచి పదిరోజులు పాటు పాల్గొంటున్నారు. తాజాగా ఆయన 'విపశ్యన' ట్రిప్ సైతం రాజకీయ విమర్శలకు దారితీసింది. చుట్టూ కంచుకోట లాంటి భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య ఆయన ధ్యాన కేంద్రానికి వెళ్లడం ఈ విమర్శలకు కారణమైంది. సామాన్యుడనని చెప్పుకుని రాజకీయాల్లోకి వచ్చిన కేజ్రీవాల్ అసలు రూపం మరోసారి బయటపడిందంటూ దీనిపై విపక్షాలు మండిపడుతున్నాయి.
Bofors Case: కుంభకోణం రూ.64 కోట్లు.. దర్యాప్తుకు రూ.250 కోట్లు.. మళ్లీ వార్తల్లోకి బోఫోర్స్ కేసు..
ట్రంప్‌ను మించిపోయారు
కేజ్రీవాల్ ట్రిప్ కోసం ఏర్పాటు చేసిన భారీ భద్రతపై ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో చురకలు వేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ భద్రతతో కేజ్రీవాల్ భద్రతను పోల్చారు. ''వీఐపీ సంస్కృతి అంటూ యావత్ ప్రపంచాన్ని ఆడిపోసుకున్న కేజ్రీవాల్ ఈరోజు డొనాల్డ్ ట్రంప్‌కు మించి సెక్యూరిటీ కవర్‌తో తిరిగుతున్నారు'' అంటూ ఆమె ట్వీట్ చేశారు.
వీఐపీ మహరాజా
కేజ్రీవాల్ 'వీఐపీ మహరాజా'లా తిరుగుతున్నారంటూ బీజేపీ నేత, ఢిల్లీ మంత్రి మంజిందర్ సింగ్ సర్సా వ్యాఖ్యానించారు. ఒకప్పుడు వేగనార్‌లో తిరుగుతూ సాధారణ వ్యక్తిలా నటించిన కేజ్రీవాల్ ఇప్పుడు విపస్యనా ధ్యానకేంద్రానికి భారీ మందీమార్బలంతో వెళ్లడాన్ని ప్రశ్నించారు. ఆయన కాన్వాయ్‌లో బుల్లెట్‌ప్రూఫ్ ల్యాండ్ క్రూయెజర్, 100 మందికి పైగా పంజాబ్ పోలీసు కమెండోలు, జామర్లు, అంబులెన్సులు ఉన్నాయి. ఇదంతా విపాస్యనా కేంద్రానికి ధ్యానం కోసం వెళ్లేందుకు వీఐపీ మహరాజా ట్రీట్‌మెంట్. ఆప్ అసలు రూపం ఏమిటో బయటపడింది. వంచన, హిపోక్రసీ మరోసారి వెల్లడైంది.. అని అన్నారు.
వంతపాడిన కాంగ్రెస్
కేజ్రీవాల్ వీఐపీ కల్చర్‌పై కాంగ్రెస్ పార్టీ సైతం విమర్శలు గుప్పించారు. కేజ్రీవాల్ అధికార దాహం గురించి తాను పదేళ్లుగా చెబుతూనే ఉన్నానని, నిరాడంబరత అనేది కేవలం ఒక నాటకమని, అధికారంలోకి వచ్చాక ఆయన విలాసాలకు అంతుండదని కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ అన్నారు. మెడిటేషన్ సెంటర్‌కు 100 వాహనాలతో కూడిన కాన్వాయ్‌లో కేజ్రీవాల్ వెళ్లడాన్ని ఆయన నిలదీశారు. కాగా, కేజ్రీవాల్ తన భార్య సునీతతో కలిసి ఈనెల 15 వరకూ ధ్యాన కేంద్రంలో ఉంటారు.
ఇవి కూడా చదవండి
Former Minister: హీరో విజయ్‌ది పగటికలే.. అందరూ ఎంజీఆర్ కాలేరు
Hero Vishal: హీరో విశాల్ ప్రశ్న.. విజయ్ మీడియా ముందుకు ఎందుకు రావడం లేదు..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.