జై హనుమాన్..
ABN , First Publish Date - 2023-05-15T00:24:58+05:30 IST
జిల్లావ్యాప్తంగా ఆదివారం హనుమద్ జయంతిని వైభవంగా నిర్వహించారు. అయా ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిం చారు.

వైభవంగా హనుమజ్జయంతి
భక్తులతో కిక్కిరిసిన మద్ది ఆలయం
పలుచోట్ల హనుమాన్ శోభాయాత్రలు
జంగారెడ్డిగూడెం టౌన్, మే 14 : జిల్లావ్యాప్తంగా ఆదివారం హనుమద్ జయంతిని వైభవంగా నిర్వహించారు. అయా ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిం చారు. పలుచోట్ల హనుమాన్ శోభాయాత్రలను విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. గుర్వాయి గూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో హనుమద్ జయంతి సహిత కల్యాణోత్సవాలను వైభవంగా నిర్వహిం చారు. పంచామృతా లతో స్వామికి అభిషేకాలు, లక్ష తమల పాకులతో పూజ, హోమాలు నిర్వహించారు. ఐదువేల మందికి పైగా భక్తులు, హనుమద్ దీక్షాధారులు పాల్గొన్నా రు. స్వామివారి గర్భాలయం, అంతరాలయం, మండపాన్ని ప్రత్యేకంగా అలంకరిం చారు. ఆలయ ధర్మకర్తలు మల్నీడి మోహనకృష్ణ (బాబీ), చిలుకూరి సత్య నారాయణరెడ్డి, దండు వెంకట కృష్ణంరాజు, కర్పూరం రవి, మానికల బ్రహ్మా నందరావు, పరపతి భాగ్య లక్ష్మి, బల్లే నాగలక్ష్మి, జవ్వాది కృష్ణ, కురగంటి రంగారావు పర్యవేక్షణలో ఏర్పాట్లు చేసినట్టు ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షురాలు సరిత విజయ భాస్కర్‌రెడ్డి, ఆలయ ఈవో ఆకుల కొండలరావు తెలిపారు.