Nimmala Ramanaidu: ప్రజలకు సంక్షేమాన్ని జగన్ సర్కార్ దూరం చేసింది
ABN, First Publish Date - 2023-07-19T17:44:19+05:30
పెన్షన్‌ను మూడు వేల చేస్తానని చెప్పి ఇప్పటికీ ఇవ్వలేని అసమర్ధుడు జగన్. మూడు పూటలా 15 రూపాయలకే అన్న క్యాంటీన్లు ద్వారా అన్నం పెడితే ఆ పథకాన్ని రద్దు చేశారు. లక్షల కుటుంబాలకు చంద్రన్న బీమా ద్వారా భద్రత కల్పించిన ఘనత చంద్రబాబుది. ఆ భద్రతను జగన్ చెరిపేశారు.
పశ్చిమగోదావరి జిల్లా: వైసీపీ ప్రభుత్వంపై (Ycp Government) పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) ధ్వజమెత్తారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘పెన్షన్‌ను మూడు వేల చేస్తానని చెప్పి ఇప్పటికీ ఇవ్వలేని అసమర్ధుడు జగన్. మూడు పూటలా 15 రూపాయలకే అన్న క్యాంటీన్లు ద్వారా అన్నం పెడితే ఆ పథకాన్ని రద్దు చేశారు. లక్షల కుటుంబాలకు చంద్రన్న బీమా ద్వారా భద్రత కల్పించిన ఘనత చంద్రబాబుది. ఆ భద్రతను జగన్ చెరిపేశారు. సైకో జగన్ వచ్చి చంద్రన్న పెళ్లికానుక తీసేశారు. సంక్షేమ పథకాలను రద్దు చేసిన సంక్షేమ ద్రోహి జగన్. 8 లక్షల పెన్షన్లు, 4 లక్షల రేషన్ కార్డులు రద్దు చేసిన ఘనత జగన్‌దే.’’ అంటూ మండిపడ్డారు.
Updated Date - 2023-07-19T17:44:19+05:30 IST