ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sujana Chowdary: టీడీపీ నేత ఆలపాటి రాజా ఇంటికి సుజనాచౌదరి వెళ్లడంలో వ్యూహమేంటి..?

ABN, First Publish Date - 2023-04-02T18:44:02+05:30

టీడీపీ నేత ఆలపాటి రాజా (TDP Leader Alapati Raja) ఇంటికి బీజేపీ మాజీ ఎంపీ సుజనాచౌదరి (Sujana Chowdary) వెళ్లడంలో వ్యూహమేంటి..?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

గుంటూరు: టీడీపీ నేత ఆలపాటి రాజా (TDP Leader Alapati Raja) ఇంటికి బీజేపీ మాజీ ఎంపీ సుజనాచౌదరి (Sujana Chowdary) వెళ్లడంలో వ్యూహమేంటి..? టీడీపీ నేత ఆలపాటి రాజా ఇంటిట్లో ఏర్పాటు చేసిన సమావేశానికి మాజీ ఎంపీ సుజనాచౌదరి, నక్కాఆనందబాబు, కన్నా లక్ష్మీ నారాయణతోపాటు పలువురు కీలక నేతలు హాజరయ్యారు. కీలక నేతల భేటీ ఆసక్తికరంగా మారింది. ఈ సమావేశంలో బీజేపీ నేత సత్యకుమార్పై జరిగిన దాడిపై చర్చించారు. అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉందని సుజనాచౌదరి చెప్పారు. సత్యకుమార్పై దాడి చేసిన వారి సంస్కృతి అర్థమవుతుందని, వైసీపీ వాళ్లే సత్యకుమార్పై దాడి చేశారని సుజనాచౌదరి ఆరోపించారు. కలిసికట్టుగా కృషి చేస్తేనే ప్రజాస్వామ్య పరిరక్షణ, అధికారం కోసం ప్రాంతీయ విభేదాలను రెచ్చగొడుతున్నారని ఆలపాటి విమర్శించారు.

రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులు చేస్తున్న దీక్ష 1,200 రోజులకు చేరుకోవడంతో వారికి మద్దతు తెలిపేందుకు సత్యకుమార్‌ వెళ్లారన్నారు. దీనిని సహించలేని వైసీపీ గుండాలు ఆయన కాన్వాయ్‌పై రాళ్లతో దాడి చేయడం సిగ్గుచేటన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, తగిన సమయంలో బుద్ధి చెబుతారని రోశయ్యయాదవ్‌ హెచ్చరించారు.

గుంటూరు జిల్లాలోని తుళ్లూరు మండలంలోని మందడం దగ్గర బీజేపీ నేత సత్యకుమార్‌ వాహనాన్ని వైసీపీ గూండాలు అడ్డుకున్నాయి. బీజేపీ నేత సత్యకుమార్‌ కారుపై రాళ్లతో వైసీపీ గూండాలు దాడి చేశాయి. దీంతో వాహనాన్ని ఆపకుండా సత్యకుమార్‌ డ్రైవర్‌ ముందుకుపోనిచ్చారు. వైసీపీ కార్యకర్తల దాడిలో కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వైసీపీ గూండాల తీరుపై బీజేపీ శ్రేణులు మండిపడుతున్నారు. సీఎం జగన్‌రెడ్డి ఆదేశాలతోనే సత్యకుమార్‌ దాడి చేశారంటూ బీజేపీ కార్యకర్తల ఆందోళన చేస్తున్నారు.

1200వ రోజు అమరావతి ఉద్యమానికి బీజేపీ తరపున జాతీయ కార్యదర్శి సత్యకుమార్ మద్దతు ప్రకటించారు. మందడం శిబిరం నుంచి తుళ్లూరు పార్టీ నేత పరామర్శకు సత్యకుమార్ వెళ్లారు. తిరిగి వస్తుండగా మందడం సమీపంలో 3 రాజధానుల శిబిరం దగ్గర సత్యకుమార్ వాహనాన్ని శిబిరంలోని వ్యక్తులు అడ్డుకున్నారు. సత్యకుమార్ కాన్వాయ్లోని కార్లపై వైసీపీ మూకలు రాళ్ల దాడి చేశాయి.,

Updated Date - 2023-04-02T18:56:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising