ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

YCP Minister: బాలకృష్ణ సినిమాపై వైసీపీ మంత్రి కామెంట్స్..

ABN, First Publish Date - 2023-10-19T18:27:55+05:30

ప్రముఖ సినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సినిమాపై మంత్రి కారుమూరు నాగేశ్వరరావు విమర్శలు గుప్పించారు.

విశాఖపట్నం: ప్రముఖ సినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సినిమాపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు విమర్శలు గుప్పించారు.

"చంద్రబాబు అరెస్టుతో బాధలో ఉంటే బాలయ్య తన సినిమా రిలీజ్ ఎందుకు వాయిదా వేయలేదు. హెరిటేజ్ ఫుడ్స్ లాభాలు పెరిగాయాని ఇటీవల ఆ సంస్థే ప్రకటించింది. రాష్ట్రం అంతా రోడ్డెక్కాలని పిలుపు ఇస్తారు. కానీ బాలయ్య, చంద్రబాబు కుటుంబ సభ్యులు సంపాదన మాత్రం మానుకోరు. టీడీపీ ప్రభుత్వం బీసీలను ఓట్లేసే యంత్రాలుగానే చూసింది. చంద్రబాబును అరెస్ట్ చేస్తే తెలంగాణలో అల్లర్లేమిటి?. ఆయనేమైన దేవుడా. ఇందిరాగాంధీ నుంచి దేశంలో పలువురు ప్రముఖులు అరెస్ట్ అయ్యారు?. వాళ్ళందరికంటే చంద్రబాబు గోప్పొడా?. దేశ చరిత్రలో నేరగాడికి ఏసీ, అటాచ్డ్ బాత్ రూమ్ ఇచ్చినది చంద్రబాబుకే. పేదరికాన్ని 6 శాతానికి తగ్గించిన ఘనత వైసీపీది. అందుకు నీతి ఆయోగ్ లెక్కలే నిదర్శనం. చంద్రబాబు పాలన స్కాంలైతే వైసీపీ ప్రభుత్వం స్కీంలు." అని మంత్రి అన్నారు.

ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌పై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. "నాలుగు నెలల క్రితమే నేను వైజాగ్ షిఫ్ట్ అయ్యాను. కుటుంబంతో సహా ఇక్కడే ఉంటున్నా. రాజధాని కావడంతోనే వైజాగ్‌లో ఇల్లు తీసుకుని మారిపోయాను. సివిల్ సప్లయిస్ డిపార్ట్‌మెంట్ కోసం అనువైన భవనాల ఎంపిక కొనసాగుతోంది. మా శాఖకు చెందిన ఆస్తులు లేనందున ప్రైవేట్ భవనాల కోసం పరిశీలిస్తున్నాం." అని మంత్రి అన్నారు.

Updated Date - 2023-10-19T18:28:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising