Kodalinani: చంద్రబాబు, పవన్‌పై మరోసారి నోరు పారేసుకున్న కొడాలి నాని
ABN, First Publish Date - 2023-06-16T13:07:08+05:30
టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని మరోసారి నోరుపారేసుకున్నారు. ‘‘నేను లెగిస్తే ఎవరూ పడుకోరని చంద్రబాబు సొల్లు కబుర్లు చెబుతున్నారు. చంద్రబాబు మగాడైతే గుడివాడ నుంచి పోటీ చేయాలి’’ అని నాని సవాల్ విసిరారు.
కృష్ణా జిల్లా: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై (TDP Chief Chandrababu Naidu) మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని మరోసారి నోరుపారేసుకున్నారు. ‘‘నేను లెగిస్తే ఎవరూ పడుకోరని చంద్రబాబు సొల్లు కబుర్లు చెబుతున్నారు. చంద్రబాబు మగాడైతే గుడివాడ నుంచి పోటీ చేయాలి’’ అని నాని సవాల్ విసిరారు. గురువారం గుడివాడలోని మల్లాయపాలెం టిడ్కో లే అవుట్ల ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కొడాలి నాని మాట్లాడుతూ... గుడివాడ నియోజకవర్గంలో ఇళ్ళ పట్టాల కోసం చంద్రబాబు ఒక ఎకరం ఇచ్చినట్లు నిరూపించినా తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ చేశారు. ఈ రాష్ట్రానికి జగనే శాశ్వత ముఖ్యమంత్రి అని కొడాలి నాని స్పష్టం చేశారు.
పవన్ కళ్యాణ్‌పై కొడాలి సెటైర్స్
నాని ఇంకా మాట్లాడుతూ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై సెటైర్లు విసిరారు. అసెంబ్లీలో అడుగు పెట్టడానికి పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టారన్నారు. నవనీత్ కౌర్, సుమలత ఇద్దరూ సినీ హీరోయిన్లని.. ఈ ఇద్దరూ ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఎంపీలు అయ్యారని తెలిపారు. అయితే 16 పార్టీలతో పొత్తులు పెట్టుకుని పవన్ కళ్యాణ్ ఏం సాధించారని ప్రశ్నించారు. చంద్రబాబు కోరిక ప్రతిపక్ష నేతగా ఉండటమని.. పవన్ కళ్యాణ్ కోరిక ఎమ్మెల్యే కావటమని.. దీని కోసం ఈ ఇద్దరూ పొత్తు పెట్టుకుంటున్నారని వ్యాఖ్యలు చేశారు. జగన్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించేగలిగే ధైర్యం ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఎవరికీ లేదని కొడాలి నాని పేర్కొన్నారు.
Updated Date - 2023-06-16T13:07:08+05:30 IST