YCP: బెజవాడలో వైసీపీ నేతలతో కిటకిటలాడుతున్న స్టార్ హోటళ్లు
ABN, First Publish Date - 2023-03-22T21:50:10+05:30
రేపు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ (MLC Election Polling) ప్రారంభం కానున్న నేపథ్యంలో బెజవాడలో వైసీపీ నేతలతో (YCP leaders) స్టార్ హోటళ్లు (Star hotels) కిటకిటలాడుతున్నాయి.
విజయవాడ: రేపు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ (MLC Election Polling) ప్రారంభం కానున్న నేపథ్యంలో బెజవాడలో వైసీపీ నేతలతో (YCP leaders) స్టార్ హోటళ్లు (Star hotels) కిటకిటలాడుతున్నాయి. పార్టీ ఎమ్మెల్యేలకు వైసీపీ సీనియర్ నేతలు, మంత్రుల విందులు ఏర్పాటు చేశారు. రేపు ఎమ్మెల్సీ ఎన్నికల (MLC election) దృష్ట్యా ఎమ్మెల్యేలతో (MLAs) విందు రాజకీయాలు (Dinner politics) చేస్తున్నారు. బ్యాచ్‌లు బ్యాచ్‌లుగా వివిధ హోటళ్లలో వైసీపీ ప్రత్యేక విందు ఏర్పాటు చేస్తోంది. వైసీపీ రెబల్స్, అసంతృప్తులు ఎక్కడ హ్యాండ్ ఇస్తారోనని వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే మాక్ ఓటింగ్‌లో ఎమ్మెల్యేల తప్పిదాలతో వైసీపీ తంటాలు పడుతోంది.
గురువారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ జరగనుంది. అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఈ పోలింగ్ ప్రక్రియ జరగనుంది. కాగా.. ఏడు స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిని రంగంలోకి దించింది. టీడీపీ రంగంలోకి దిగడంతో అధికార వైసీపీ అప్రమత్తమైంది. కొంతమంది అధికార పార్టీ ఎమ్మెల్యేలపై వైసీపీ పెద్దలు నిఘా పెట్టారని సమాచారం. మరోవైపు.. అనుమానం ఉన్న ఎమ్మెల్యేలపై వైసీపీ హైకమాండ్ ప్రత్యేక దృష్టి సారించింది. అంతేకాదు.. కొంతమంది ఎమ్మెల్యేలతో సీఎం జగన్ మోహన్ రెడ్డే (YS Jagan Mohan Reddy) నేరుగా మాట్లాడినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అనుమానం ఉన్న ఎమ్మెల్యేలు, వారి బంధువులతోనూ వైసీపీ హైకమాండ్ మాట్లాడుతోంది. ఓటు వేయించే బాధ్యతను సీనియర్ నేతలకు సీఎం జగన్ అప్పగించారు. ఏడుగురు సీనియర్ నేతలకు ఒక్కొక్కరికి 22 మంది ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకునే బాధ్యత వైసీపీ అధిష్టానం కట్టబెట్టింది. సీనియర్ ఎమ్మెల్యేలకు తోడు కొంతమంది మంత్రులను వైసీపీ కేటాయించింది.
Updated Date - 2023-03-22T21:53:57+05:30 IST