Viveka Case: వైఎస్ వివేకా హత్య కేసు విచారణ జూన్ 30కి వాయిదా
ABN, First Publish Date - 2023-06-16T12:38:45+05:30
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ హత్య కేసుకు సంబంధించి శుక్రవారం ఉదయం సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో ఆరుగురు నిందితులను కోర్టులో సీబీఐ హాజరుపర్చింది. గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను సీబీఐ అధికారులు కోర్టులో హాజరుపర్చారు.
హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి (YS Viveka Case) హత్య కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ హత్య కేసుకు సంబంధించి శుక్రవారం ఉదయం సీబీఐ కోర్టులో (CBI Court) విచారణ జరిగింది. ఈ కేసులో ఆరుగురు నిందితులను కోర్టులో సీబీఐ హాజరుపర్చింది. గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను సీబీఐ అధికారులు కోర్టులో హాజరుపర్చారు. తదుపరి విచారణను సీబీఐ కోర్టు ఈ నెల 30కి వాయిదా వేసింది. దీంతో నిందితులను అధికారులు తిరిగి చంచల్ గూడ జైలుకు తరలించారు. కాగా.. జూన్ 30న వివేకా హత్య కేసు దర్యాప్తును ముగించాలని సీబీఐను సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. మరోవైపు సీబీఐ కోర్టు కూడా ఈ కేసు విచారణను ఈనెల 30కి వాయిదా వేసిన నేపథ్యంలో ఏం జరుగుతుందా అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఇదిలా ఉంటే.. వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డిని (MP Avinash Reddy) సీబీఐ ఏ8గా పేర్కొంది. అవినాశ్‌కు తెలంగాణ హైకోర్టు (Telangana High Court)ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాల మేరకు అవినాశ్ ప్రతీ శనివారం సీబీఐ ముందు విచారణకు హాజరవుతున్నారు. ప్రతీ శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అవినాశ్‌ను సీబీఐ అధికారులు విచారించారు. వివేకా హత్యకు సంబంధించి అనేక విషయాలను ఎంపీని సీబీఐ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ముందస్తు బెయిల్ తర్వాత రెండు శనివారాలు అవినాశ్ సీబీఐ విచారణను ఎదుర్కున్నారు.
Updated Date - 2023-06-16T12:38:45+05:30 IST