ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viveka Case: మీడియాకు అభివాదం చేస్తూ సీబీఐ ఆఫీస్‌లోకి భాస్కర్ రెడ్డి

ABN, First Publish Date - 2023-04-24T09:56:37+05:30

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులు వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్‌కుమార్ రెడ్డిల సీబీఐ కస్టడీ కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో (Former minister YS Vivekanandareddy) నిందితులు వైఎస్ భాస్కర్ రెడ్డి (YS bhaskar Reddy), ఉదయ్‌కుమార్ రెడ్డిల సీబీఐ కస్టడీ (CBI custody) కొనసాగుతోంది. సోమవారం ఉదయం ఆరవ రోజు ఇద్దరి సీబీఐ విచారణ మొదలైంది. ఉదయం చంచల్‌గూడ జైలుకు చేరుకున్న సీబీఐ అధికారులు.. భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్ రెడ్డిలను సీబీఐ కార్యాలయానికి తీసుకువచ్చారు. మీడియాకు అభివాదం చేస్తూ భాస్కర్‌రెడ్డి లోపలికి వెళ్లారు. అనంతరం ఆరవ రోజు భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్ రెడ్డిల కస్టడీ విచారణ ప్రారంభమైంది. కాగా నేటితో భాస్కర్‌రెడ్డి కస్టడీ విచారణ ముగియనుంది.

ఈ కేసుకు సంబంధించి ఐదు రోజులపాటు సుదీర్ఘంగా ఇద్దరిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. వైఎస్ వివేక హత్య విషయంపై ఇద్దరినీ పలు భిన్న కోణాల్లో సీబీఐ ప్రశ్నించింది. మరోవైపు నేడు సుప్రీంకోర్టులో సునీత పిటిషన్‌పై విచారణ జరుగనుంది. అవినాష్ రెడ్డి మధ్యంతర బెయిల్‌పై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా అవినాష్ రెడ్డి విషయంలో సీబీఐ ఆధారంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే సీబీఐ అధికారుల బృందం ఢిల్లీకి చేరుకుంది. ఈ క్రమంలో అవినాష్ రెడ్డి విషయంలో సుప్రీం కోర్టు ఎలాంటి నిర్ణయ తీసుకోబోతోంది అనే ఉత్కంఠ నెలకొంది.

Updated Date - 2023-04-24T10:07:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising