ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

YCP Fake News Alert: ఏబీఎన్‌ బ్రేకింగ్ అంటూ వైసీపీ ఫేక్ ప్రచారం.. ఈసారి ఏ దుష్ప్రచారానికి తెగబడ్డారంటే..

ABN, First Publish Date - 2023-03-29T22:45:08+05:30

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం వేడెక్కింది. అధికార వైసీపీలో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోంది. గ్రాడ్యుయేట్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోర ఓటమి, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం వేడెక్కింది. అధికార వైసీపీలో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోంది. గ్రాడ్యుయేట్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోర ఓటమి, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ జయకేతనం ఎగురవేయడంతో వైసీపీలో నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ పరిణామాలకు తోడు వివేకా హత్య కేసులో సీబీఐకి సుప్రీం కోర్టు తాజాగా డెడ్‌లైన్ కూడా విధించడంతో వైసీపీ అధినేత జగన్ రెడ్డిలో కలవరం తారా స్థాయికి చేరింది. ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తన బాబాయ్ కొడుకైన వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని కాపాడేందుకు కేంద్ర పెద్దలను జగన్ పదేపదే కలుస్తున్నాడని తెలుగుదేశం పార్టీ ప్రధానంగా విమర్శలు చేస్తుండటం గమనార్హం.

ఈ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక వైసీపీ సోషల్ మీడియాలో ప్రత్యర్థి పార్టీలను నేరుగా ఢీకొట్టలేక నీచ ప్రచారాలకు దిగజారింది. టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో ఆ పార్టీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు అనని మాటలను అన్నట్టుగా, ఆ వ్యాఖ్యలను ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో ప్రసారం చేసినట్టుగా దుష్ప్రచారం చేసే స్థాయికి వైసీపీ దిగజారడం ఆ పార్టీలో అసహనం ఏ స్థాయికి చేరిందో చెప్పకనే చెబుతోంది.

ఏపీలో పొత్తులపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని టీడీపీ అధినేత చంద్రబాబు, ఇటు జనసేన అధినేత పవన్ కూడా ఇప్పటికే స్పష్టం చేశారు. కానీ.. ‘‘జనసేనతో పొత్తు మాకు అవసరం లేదు. జనసేనకే మాతో అవసరం. అవసరమైతే పొత్తు లేకుండా మేమే 175 స్థానాల్లో ఒంటరి పోరాటం చేస్తాం’’ అని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెం నాయుడు అన్నట్టుగా ఏబీఎన్ బ్రేకింగ్ టెంప్లేట్స్‌ను, ఏబీఎన్ లోగోను వాడుకుని సోషల్ మీడియా వేదికగా వైసీపీ అవాస్తవాలను ప్రచారం చేసింది. వాస్తవం ఏంటంటే.. ఆ వ్యాఖ్యలు అచ్చెం నాయుడు చేయలేదు సరికదా అలాంటి వార్తలేవీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారం చేయలేదని వీక్షకులకు స్పష్టం చేస్తున్నాం. వైసీపీ ప్రభుత్వ లోపాలను ప్రజల దృష్టికి తీసుకెళుతోందనే ఒకేఒక్క కారణంతో ఏబీఎన్‌పై, ఆంధ్రజ్యోతిపై వైసీపీ అధినేత జగన్ రెడ్డి బహిరంగ సభల వేదికగా పలుమార్లు అక్కసు వెళ్లగక్కిన సంగతి అందరికీ తెలిసిందే.

వైసీపీ సోషల్ మీడియా విభాగం ఆంధ్రజ్యోతిని, ఏబీఎన్‌ను తెలుగు ప్రజల దృష్టిలో బ్యాడ్ చేసేందుకు అమితాసక్తి చూపుతుండటం గమనార్హం. వెంటాడుతున్న కేసుల భయం, వరుసగా ఎన్నికల్లో ఓటమి వంటి చేదు అనుభవాల వల్ల ఈ నెగిటివ్ క్యాంపెయిన్‌ను వైసీపీ మరింత ముమ్మరం చేసింది. కానీ.. అక్షరమే ఆయుధంగా ఆంధ్రజ్యోతి, దమ్మున్న ఛానల్‌గా ఏబీఎన్ ఇలాంటి ఎన్నో దుష్ప్రచారాలను తిప్పికొట్టి తెలుగు ప్రజలకు దగ్గరనే ఉంది. ఉంటుంది. రాజకీయ ప్రత్యర్థులను ఎన్నికల రణ క్షేత్రంలో ఎదుర్కోలేక తమకు నచ్చని మీడియా సంస్థల పేరును, లోగోలను అడ్డం పెట్టుకుని దుష్ప్రచారం చేసేంత స్థాయిలో వైసీపీ ఉండటం శోచనీయం. వైసీపీ సోషల్ మీడియా ఇలాంటి ఫేక్ ప్రచారాలను ఇకనైనా మాని.. వైసీపీ అధినేత జగన్ ఢిల్లీ టూర్లు, ఆ టూర్లకు సంబంధించిన ఖర్చులు, ఆ టూర్ల అసలు ఉద్దేశాలపై స్పష్టత ఇస్తే మేలని మెజార్టీ ప్రజలు అభిప్రాయపడుతుండటం గమనార్హం.

Updated Date - 2023-03-29T22:45:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising