ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Amazon: అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ తేదీ ఫిక్స్.. భారీ డిస్కౌంట్లు, బంపరాఫర్లు!

ABN, First Publish Date - 2023-01-11T21:49:51+05:30

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్’ (Amazon Great Republic Day sale) తేదీ ప్రకటించింది. జనవరి 17న మొదలై జనవరి 20న ముగియనున్నట్టు తెలిపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్’ (Amazon Great Republic Day sale) తేదీ ప్రకటించింది. జనవరి 17న మొదలై జనవరి 20న ముగియనున్నట్టు తెలిపింది. అయితే ప్రైమ్ యూజర్లకు (Prime Users) ఒకరోజు ముందుగా అంటే జనవరి 16న సేల్ అందుబాటులోకి రానుందని అమెజాన్ వివరించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ(SBI)) భాగస్వామ్యంతో అదనపు ఆఫర్లు అందివ్వనున్నట్టు వెల్లడించింది.

ఫోన్లపై భారీ డిస్కౌంట్..

కాగా అమెజాన్ రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ఆఫర్ చేయనుంది. యాపిల్(Apple), వన్‌ప్లస్(OnePlus), రెడ్‌మీ(Redmi), పోకో(Poco), సామ్‌సంగ్(Samsung)తోపాటు ఇతర కంపెనీల ఫోన్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఫ్లాట్‌ డిస్కౌంట్ ఆఫర్లకుతోడు ఎస్‌బీఐ క్రెడిట్‌కార్డ్‌తో (SBI Creditcard) కస్టమర్లు 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు. అయితే ఏయే వస్తువులపై ఎంతెంత డిస్కౌంట్లు అందిస్తున్న విషయాన్ని అమెజాన్ ప్రకటించలేదు. టీజర్ సంకేతాలు చూస్తుంటే... ఐఫోన్ 13 (iPhone13), ఐఫోన్ 14 (iPhone14) ఫోన్లు డిస్కౌంట్‌లో లభించొచ్చని తెలుస్తోంది. వన్‌ప్లస్, రెడ్‌మీ, సామ్‌సంగ్, షియోమీతోపాటు ఇతర బ్రాండ్ల ఫోన్లపై భారీ డిస్కౌంట్ లభించే అవకాశాలున్నాయి. అయితే ఏయే బ్రాండ్లపై లభించనున్నాయనేది తెలియరాలేదు. కాగా స్మార్ట్‌ఫోన్లపై 40 శాతం వరకు ఫ్లాట్‌ డిస్కౌంట్లు ఆఫర్ చేయొచ్చుననే అంచనాలున్నాయి. వన్‌ప్లస్ 10టీ, సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్‌ఈ, ఐక్యూవోవో నియో 6, రెడ్‌మీ నోట్ 11తోపాటు పలు ఇతర మోడల్ ఫోన్లపై భారీ తగ్గింపు ఉండొచ్చు.

స్మార్ట్‌ఫోన్లతోపాటు ల్యాప్‌టాబ్స్, హెడ్‌ఫోన్స్, ఇతర అనేక ఎలక్ట్రానిక్ ప్రొడక్టులపై డిస్కౌంట్ ఆఫర్లు లభించనున్నాయి. ల్యాప్‌టాబ్స్‌పై 40 శాతం వరకు, స్మార్ట్‌వాచ్‌లు, ఫిట్‌నెస్ బ్యాండ్ కేటగిరి ప్రొడక్టులపై 75 శాతం వరకు డిస్కౌంట్ లభించే అవకాశాలున్నాయి. స్పీకర్స్‌పై 65 శాతం వరకు, టీవీలు, రిఫ్రిజిరేటర్స్, వాషింగ్ మెషిన్లు, ఎయిర్ కండీషనర్లు, డిష్‌వాషర్స్‌ వంటి గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు లభించే అవకాశాలున్నాయి. ఫ్లాట్ డిస్కౌంట్లకు అదనంగా బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్చేంజ్ ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎంఐ, కొన్ని పరికరాలకు ఫ్రీ స్ర్కీన్ రిప్లేస్‌మెంట్ వంటి ఆఫర్లు ఉండనున్నాయి.

Updated Date - 2023-01-11T21:57:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising