నిర్మా చేతికి గ్లెన్‌మార్క్‌ లైఫ్‌ సైన్సెస్‌

ABN , First Publish Date - 2023-09-22T01:28:20+05:30 IST

భారత ఫార్మా రంగంలో మరో భారీ టేకోవర్‌ చోటు చేసుకుంది. గ్లెన్‌మార్క్‌ లైఫ్‌ సైన్సెస్‌ (జీఎల్‌ఎస్‌) ఈక్విటీలో 75 శాతం వాటాను నిర్మా లిమిటెడ్‌కు విక్రయించాలని...

నిర్మా చేతికి గ్లెన్‌మార్క్‌ లైఫ్‌ సైన్సెస్‌

  • డీల్‌ విలువ రూ.5,651 కోట్లు

న్యూఢిల్లీ: భారత ఫార్మా రంగంలో మరో భారీ టేకోవర్‌ చోటు చేసుకుంది. గ్లెన్‌మార్క్‌ లైఫ్‌ సైన్సెస్‌ (జీఎల్‌ఎస్‌) ఈక్విటీలో 75 శాతం వాటాను నిర్మా లిమిటెడ్‌కు విక్రయించాలని మాతృసంస్థ గ్లెన్‌మార్క్‌ ఫార్మా నిర్ణయించింది. నిర్మా లిమిటెడ్‌ ఇందుకోసం ఒక్కో జీఎల్‌ఎస్‌ షేరుకు రూ.615 చొప్పున మొత్తం రూ.5,651.5 కోట్లు చెలిస్తుంది. గురువారం జరిగిన బోర్డు సమావేశంలో గ్లెన్‌మార్క్‌ ఫార్మా బోర్డు ఇందుకు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం జీఎల్‌ఎస్‌లో గ్లెన్‌మార్క్‌కు 82.84 శాతం వాటా ఉంది. కాగా రెగ్యులేటరీ సంస్థలు, జీఎల్‌ఎస్‌ వాటాదారుల అమోదం తర్వాత నిర్మా లిమిటెడ్‌ మిగతా 25 శాతం వాటా కొనుగోలు కోసం ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటిస్తుంది. ఓపెన్‌ ఆఫర్‌లో భాగంగా నిర్మా.. ఒక్కో షేరును రూ.631 ధరకు కొనుగోలు చేయనుంది. జీఎల్‌ఎస్‌.. యాక్టివ్‌ ఫార్మా ఇన్‌గ్రిడియెంట్స్‌ (ఏపీఐ) ఉత్పత్తిలో కీలకంగా ఉంది. అంతేకాకుండా అనేక ప్రముఖ జెనరిక్‌ కంపెనీలకు ఈ ఏపీఐలను సరఫరా చేస్తోంది. ఈ కొనుగోలు ద్వారా నిర్మా ఫార్మా రంగంలోకి అడుగిడుతోంది.

Updated Date - 2023-09-22T01:28:20+05:30 IST