ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Budget 2023 Section 80C: ఎంతోమంది ఈ కోరిక బడ్జెట్ 2023లో తీరేనా?

ABN, First Publish Date - 2023-01-13T17:41:27+05:30

బడ్జెట్ 2023(Budget2023) ప్రవేశపెట్టడానికి సమయం దగ్గరపడిన నేపథ్యంలో కేటాయింపులు, ప్రకటనలపై ఆసక్తి పెరుగుతోంది. విభిన్న వర్గాల్లో బడ్జెట్‌పై లెక్కకు మించిన అంచనాలు నెలకొన్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: బడ్జెట్ 2023(Budget2023) ప్రవేశపెట్టడానికి సమయం దగ్గరపడిన నేపథ్యంలో కేటాయింపులు, ప్రకటనలపై ఆసక్తి పెరుగుతోంది. విభిన్న వర్గాల్లో బడ్జెట్‌పై లెక్కకు మించిన అంచనాలు నెలకొన్నాయి. ఆశాజీవుల నుంచి వినిపిస్తున్న ప్రధాన డిమాండ్లలో సెక్షన్ 80 సీ పరిమితి పెంపు (section 80C limit) ఒకటిగా ఉంది. ఆదాయం నుంచి వేర్వేరు పెట్టుబడులపై (Investment) పన్ను మినహాయింపునిచ్చే (tax deductions) ఈ సెక్షన్ కింద ప్రస్తుత పరిమితి వార్షికానికి రూ.1.5 లక్షలుగా ఉంది. దీనిని బడ్జెట్ 2023లో రూ.2 లక్షలు లేదా రూ.2.50 లక్షలకు పెంచాలని వ్యక్తిగత చెల్లింపుదార్లతోపాటు ఆర్థిక, పన్ను నిపుణులు కోరుతున్నారు. పరిమితి పెంపు ద్వారా వ్యక్తిగత చెల్లింపుదార్లపై వార్షిక పన్నుభారం తగ్గుతుందని సూచిస్తున్నారు. ఫలితంగా వేర్వేరు స్కీమ్స్‌లో పొదుపు, పెట్టుబడులకు సెక్షన్ 80 వర్తించి పన్ను మినహాయింపులు దక్కుతాయని చెబుతున్నారు.

కాగా చెల్లింపుదార్ల ప్రయోజనార్థం బడ్జెట్ 2023లో ట్యాక్స్ స్లాబులు, రేట్లను ప్రభుత్వం సవరించొచ్చనే నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా వ్యక్తిగత చెల్లింపుదార్లకు అధిక ప్రయోజనం కలిగించే సెక్షన్ 80(సీ) పరిమితి రూ.1.5 లక్షల నుంచి రూ.2.5 లక్షలకు పెంపును ఆశిస్తున్నట్టు ఫిస్డమ్ ప్రవేట్ వెల్త్ సీఈవో అభిజిత్ భావే (Abhijit Bhave) పేర్కొన్నారు. ఇదే జరిగితే ఈఎల్ఎస్ఎస్ (ELSS) (ఈక్విటీ-లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్) మ్యూచువల్ ఫండ్లలో(Mutual funds) పెట్టుబడులు పెరుగుతాయని విశ్లేషించారు.

సెక్షన్ 80సీ పరిమితి పెంచాల్సిందే!

బడ్జెట్-2023లో (Budget2023) పన్ను సంబంధిత మినహాయింపులు పెద్దగా ఇవ్వకపోయినా.. సెక్షన్ 80సీ పరిధి, పరిమితులు విస్తృతం చేయాలనే డిమాండ్లు పలు రంగాల్లో వినిపిస్తున్నాయి. ఫిస్డమ్ సహ-వ్యవస్థాపకుడైన ఆనంద్ దాల్మియా స్పందిస్తూ.. భారీ పన్ను తాయిళాలు, రాయితీలు కోరుకోవడంలేదని, రంగాలవారీగా సరైన కేటాయింపులు ఇస్తే చాలని ఆశిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. తలసరి ఆదాయం పెరుగుతున్న దృష్ట్యా రంగాలవారీగా సెక్షన్ 80సీ వర్తించే విధంగా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ సెక్షన్ పరిధి పెంచాల్సిన తక్షణ అవసరముందని పేర్కొన్నారు.

ఇక ఇన్సూరెన్స్ రంగానికి చెందిన నిపుణులు కూడా బడ్జెట్ 2023లో సెక్షన్ 80సీ పరిధి పెంపుపై ఆశలు పెట్టుకున్నారు. జీవిత బీమా ప్రీమియంలపై పన్ను మినహాయింపుల కోసం వేర్వేరు సెక్షన్లు రూపొందించాలని ఎడిల్‌వీస్ టోకియో లైఫ్ ఇన్సూరెన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుభ్రజిత్ ముఖోపాధ్యాయ్ పేర్కొన్నారు. ఈ అంచనాలు ఎంతవరకు నిజమవుతాయో తెలియాలంటే బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు ఫిబ్రవరి 1 వరకు వేచిచూడాల్సిందే.

Updated Date - 2023-01-13T17:46:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising