Valentine’s Day: ప్రేమ జంటల కోసం వండర్‌లా ప్రత్యేక ప్యాకేజీలు

ABN , First Publish Date - 2023-02-12T21:09:43+05:30 IST

ఈ నెల 14న ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలోని

Valentine’s Day: ప్రేమ జంటల కోసం వండర్‌లా ప్రత్యేక ప్యాకేజీలు

బెంగళూరు: ఈ నెల 14న ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలోని అతిపెద్ద అమ్యూజ్‌మెంట్ పార్క్ చైన్ సంస్థ వండర్‌లా హాలీడేస్(Wonderla Holidays) ప్రత్యేక ప్యాకేజీలను తీసుకొచ్చింది. వాలెంటైన్స్ వీక్(Valentine's Week) పేరుతో ఈ నెల 10న ప్రారంభించిన కార్యక్రమాలు 14వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ ప్రత్యేక ప్యాకేజీలు బెంగళూరు, హైదరాబాద్, కొచ్చిలలో అందుబాటులో ఉన్నాయి. ప్రేమ జంటలు తమ జీవితంలో మర్చిపోలేని అనుభూతులను సొంతం చేసుకునే అవకాశాన్ని వండర్‌లా తీసుకొచ్చింది.

300 అడుగుల ఎత్తులో స్కై వీల్‌పై డైనింగ్, వేవ్‌పూల్ వద్ద బఫె డిన్నర్ వంటి అనుభూతులను పంచుతోంది. స్కై వీల్‌ డైన్‌ అనుభవాల కోసం ఒక జంట 399 రూపాయలు (జీఎస్‌టీతో కలిపి) చెల్లిస్తే సరిపోతుంది. ఇది ఫిబ్రవరి 10 నుంచి 14 ఫిబ్రవరి వరకు అందుబాటులో ఉంటుంది. అలాగే వేవ్‌ పూల్‌ బఫె డిన్నర్‌ కోసం ఒక్కో జంటకు రూ. 849గా నిర్ణయించారు. అయితే, ఇది ఈ నెల వాలెంటైన్స్ డేన అంటే ఫిబ్రవరి 14న మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ రెండు ప్యాకేజీలూ పార్క్‌ ఎంట్రీ కాంబో ప్యాకేజీలుగా సైతం లభ్యమవుతాయి.

సో, మరెందుకాలస్యం. ఈ ప్రేమికుల దినోత్సవాన ప్రియమైన వారితో వండర్‌లాలో వాలిపోండి. మీ ప్రేమను జీవితాంతం ఓ మధురానుభూతిగా మార్చుకోండి. ఆన్‌లైన్ ద్వారా ముందుగా కూడా ప్రవేశ టికెట్లను బుక్ చేసుకోవచ్చు.

Updated Date - 2023-02-12T21:09:45+05:30 IST