ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

EMIs: మీరు ఈఎంఐలు చెల్లిస్తున్నారా? మరి ఈ విషయాలు తెలుసా లేదా?

ABN, First Publish Date - 2023-01-20T17:24:18+05:30

ఆర్థిక నిర్వహణలో (financial management) వివేకంతో వ్యవహరించకపోతే ఇబ్బందులు చవిచూడాల్సి ఉంటుంది. ఫైనాన్స్ వ్యవహరాల్లో తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తే కొంతలో కొంతయినా ఉపశమనం పొందొచ్చు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: ఆర్థిక నిర్వహణలో (financial management) వివేకంతో వ్యవహరించకపోతే ఇబ్బందులు చవిచూడాల్సి ఉంటుంది. ఫైనాన్స్ వ్యవహరాల్లో తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తే కొంతలో కొంతయినా ఉపశమనం పొందొచ్చు. ముఖ్యంగా ఎన్నో ఇబ్బందులు చవిచూస్తూ ఈఎంఐలు (EMI) చెల్లిస్తున్నవారికి ఈ సూత్రం ఉపయోగకరం. మరి వ్యక్తిగత రుణాలపై ఈఎంఐలు చెల్లిస్తున్నవారి కోసం 5 ముఖ్యమైన టిప్స్ ఉన్నాయి. వీటిని పాటించడం ద్వారా మనీ సేవ్ చేసుకోవచ్చునని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం...

1. డౌన్ పేమెంట్‌ను (down payment) వీలైనంత ఎక్కువగా కట్టాలి. తద్వారా ఈఎంఐ వీలైనంత మేర తగ్గుతుంది. దీర్ఘకాల సేవింగ్స్‌కు (long term savings) ఈ విధానం ఉపయోగపడుతుంది.

2. పేమెంట్లను నిర్వహించుకునేందుకు వీలుగా వ్యక్తిగత రుణంపై (personal) ఈఎంఐలను దీర్ఘకాలంపాటు చెల్లించే అవకాశాలను పరిశీలించండి. తద్వారా తక్కువ భారంతో ఈఎంఐలు చెల్లించేందుకు వీలుంటుంది.

3. వ్యక్తిగత రుణంపై ఈఎంఐలు సక్రమంగా చెల్లించాలంటే అప్పటికే ఉన్న అప్పులను పరిగణలోకి తీసుకోవాలి. చెల్లించాల్సిన అత్యవసరమైనవి ఏమైనా ఉంటే ప్రాధాన్యత దృష్టా చెల్లించడం ఉత్తమం. లేదంటే ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

4. ఈఎంఐపై వ్యక్తిగత రుణం తీసుకునేటప్పుడు పాక్షిక ముందస్తు చెల్లింపు ఆప్షన్ (partial prepayment option) ఎంచుకోవడం ఉత్తమం. తద్వారా ఈఎంఐలు చెల్లించాల్సిన కాలం తగ్గుతుంది. అంతేకాకుండా ఈఎంఐ భారం కూడా కొంత మొత్తంలో తగ్గుతుంది.

5. అధిక వడ్డీ రేటు (Highest interest) ఉన్న రుణాన్ని(Loan) ముందుగా చెల్లించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి. తద్వారా ఎంతకొంత సేవ్ చేసుకునే అవకాశం కస్టమర్లకు దక్కుతుంది.

Updated Date - 2023-01-20T17:28:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising