SBI Amrit Kalash Scheme: అధిక వడ్డీ వచ్చే ఎస్‌బీఐ స్పెషల్ స్కీమ్.. ఈ నెలాఖరు వరకే అవకాశం!
ABN, First Publish Date - 2023-12-06T10:40:00+05:30
SBI Amrit Kalash FD Scheme: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్ల కోసం అధిక వడ్డీ వచ్చే స్పెషల్ స్కీమ్ 'అమృత్ కలశ్'ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా ప్రకటించిన ఒక స్పెషల్ ఆఫర్ ఈ నెలాఖరుకు ముగుస్తుంది.
SBI Amrit Kalash FD Scheme: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్ల కోసం అధిక వడ్డీ వచ్చే స్పెషల్ స్కీమ్ 'అమృత్ కలశ్'ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా ప్రకటించిన ఒక స్పెషల్ ఆఫర్ ఈ నెలాఖరుకు ముగుస్తుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 'అమృత్ కలశ్' ఒక ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్. మీ చేతిలో కొంత డబ్బు ఉండి, తక్కువ సమయంలో మంచి ఆదాయం సంపాదించాలనే ప్లాన్ ఉంటే మాత్రం మీకు ఈ స్కీమ్ ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అమృత్ కలశ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం గడువును ఇప్పటికే ఎస్‌బీఐ చాలా సార్లు పొడిగించింది. ఈ పథకానికి ఉన్న డిమాండ్ దృష్ట్యా డెడ్‌లైన్‌ను ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వస్తోంది. అయితే, తాజాగా ఈ పథకంలో చేరడానికి చివరి గడువును 2023 డిసెంబర్ 31గా నిర్ణయించింది. ఇకపై ఎస్‌బీఐ ఈ స్కీమ్ చివరి తేదీని మరోమారు పెంచుతుందో లేదో తెలియదు. కనుక ఈ గడువులోపు స్కీమ్‌లో జాయిన్ అయితే బెటర్.
అమృత్ కలశ్ వడ్డీ రేటు..
ఎస్‌బీఐ అమృత్ కలశ్ పథకం టైమ్ పిరియడ్‌ను 400 రోజులుగా ఫిక్స్ చేసింది. ఈ డిపాజిట్ పథకంలో పెట్టుబడి పెట్టే సీనియర్ సిటిజన్లకు ఏడాదికి 7.6శాతం వడ్డీ రేటు ఉటుంది. అలాగే సాధారణ పౌరులకైతే 7.1శాతం వడ్డీ ఇస్తుంది బ్యాంక్. ఇక ఎస్‌బీఐ ఉద్యోగులు, పెన్షనర్లకు అదనంగా ఒక శాతం (1%) వడ్డీ ఆఫర్ ఉంది. ఉదాహరణకు ఈ స్కీమ్‌లో ఒక సీనియర్ సిటిజన్ ఒక 5 లక్షల రూపాయలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే.. 7.6శాతం వడ్డీ రేటు ప్రకారం 400 రోజులకు అతనికి రూ.43,000 వడ్డీ వస్తుంది. ఇక ఇదే మొత్తానికి ఒక సాధారణ పౌరుడికి నాలుగు వందల రోజులకు లభించే వడ్డీ మొత్తం వచ్చేసి రూ.40,085.
అమృత్ కలశ్ కోసం దరఖాస్తు ఇలా..
మీకు దగ్గరలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖకు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. లేనిపక్షంలో ఇంటర్నెట్ బ్యాంకింగ్, 'ఎస్‌బీఐ యోనో' (SBI YONO) యాప్ ద్వారా కూడా ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - 2023-12-06T10:40:02+05:30 IST