ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Education: స్కూళ్ల అభివృద్ధిపై మాట మార్చిన సర్కార్! తాజాగా కొత్త పాట!

ABN, First Publish Date - 2023-04-03T14:24:02+05:30

‘నాడు-నేడు’ (Nadu-Nedu scheme) ఏనాడు? అంటూ ‘ఆంధ్రజ్యోతి’ లేవనెత్తిన అనుమానాలే నిజమయ్యాయి. ప్రభుత్వ బడులను ‘కార్పొరేట్‌’ లెవెల్‌కు తీసుకువెళుతున్నామంటూ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్‌ (Jagan) చేస్తున్నదంతా వట్టి ఆర్భాటమేనని తేలిపోయింది. షెడ్యూల్‌ ప్రకారం ఇప్పటికి

Nadu Nedu scheme
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

నాడు - నేడుపైనా మడత!

స్కూళ్ల అభివృద్ధిపై మాట మార్చిన జగన్‌

వచ్చే జూలై నాటికి మొత్తం పనులని ప్రకటన

మరో రెండేళ్లు కావాలని తాజాగా కొత్త పాట

అప్పుడే ‘కార్పొరేట్‌’కు దీటుగా మార్చగలరట!

ఎన్నికల్లోపు పూర్తికావని పరోక్షంగా వెల్లడి

2022 ఆగస్టు నాటికే రెండో దశ పూర్తి కావాలి

రూ.8 వేల కోట్లకు ఖర్చు చేసింది 1751 కోట్లే

ఈ బడ్జెట్‌లో రూ.3500 కోట్లు కేటాయింపు

బిల్లులు ఇవ్వకపోవడంతో కదలని పనులు

సగం పనులు కూడా కాలేదని బొత్స ఒప్పుకోలు

వచ్చే ఏడాదికీ పూర్తి కావడం కష్టమే

అతీగతీ లేని మూడో దశ పనులు

‘నాడు-నేడు’ (Nadu-Nedu scheme) ఏనాడు? అంటూ ‘ఆంధ్రజ్యోతి’ లేవనెత్తిన అనుమానాలే నిజమయ్యాయి. ప్రభుత్వ బడులను ‘కార్పొరేట్‌’ లెవెల్‌కు తీసుకువెళుతున్నామంటూ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్‌ (Jagan) చేస్తున్నదంతా వట్టి ఆర్భాటమేనని తేలిపోయింది. షెడ్యూల్‌ ప్రకారం ఇప్పటికి మూడో దశ పనులు మొదలు కావాలి. కానీ, ఇంకా ‘రెండోదశ’నే దాటలేక జగన్‌ సర్కారు పిల్లిమొగ్గలు వేస్తోంది. ఈ పనుల కోసం వెచ్చించాల్సిన రూ. 8వేల కోట్లలో ఇప్పటికే ఖర్చుచేసింది కేవలం 1751 కోట్లే. చాలీచాలని నిధులతో పనులు మొదలుపెట్టడంతో బిల్లులు కొండలా పేరుకుపోయాయి. దీంతో పనులు పూర్తి చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు.

రాష్ట్ర ప్రభుత్వం మాత్రం గడువును ఎప్పటికప్పుడు పొడిగిస్తూ పోతోంది. గత ఏడాది ఆగస్టునాటికే పూర్తి కావాల్సిన పనులివి. ఈఏడాది జూన్‌ నాటికి పూర్తిచేస్తామని అప్పట్లో చెప్పారు. ఇప్పుడేమో ఆ గడువును మరింత ముందుకు జరిపి.. మరో రెండేళ్లు పడుతుందని జగన్‌ చెబుతున్నారు. ఎన్నో పొడిగింపుల తర్వాతా ఈ పనులు సగం కూడా కాని పరిస్థితి! ఈ మాట స్వయంగా మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాకు సెలవిచ్చారు.

(అమరావతి-ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ బడుల రూపురేఖలు మారుస్తామంటూ జగన్‌ సర్కారు నాడు-నేడు పథకం ((Nadu-Nedu scheme) చేపట్టింది. ఇది ప్రతిష్టాత్మక పథకమని, నిర్దేశిత సమయానికి పూర్తి చేసి చూపిస్తామని గొప్పలు చెప్పింది. షెడ్యూలు కూడా ప్రకటించింది. అయితే చెప్పిన సమయానికి పనులు మాత్రం పూర్తి చేయలేకపోతోంది. మొదటి దశ పనులను ఆలస్యంగానైనా పూర్తి చేసింది. రెండో దశ పనులను ఏడాది ఆలస్యంగా ప్రారంభించింది. ఇందుకు సరిపడా నిధులు కేటాయించలేదు. చేసిన పనులకూ పూర్తిగా బిల్లులు చెల్లించలేదు. దీంతో చాలా చోట్ల పనులు ఆగిపోయాయి. మూడో దశ పనులను ఇప్పటికే ప్రారంభించాల్సి ఉండగా అతీగతీ లేదు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఈ పథకంపై ప్రభుత్వం మాట మార్చింది. గత కొద్దిరోజులుగా సీఎం జగన్‌ మరో ‘రెండేళ్లు’ అంటూ కొత్త రాగం అందుకున్నారు. ఈ ఏడాది జూలై నాటికి మొత్తం పాఠశాలల్లో నాడు-నేడు పనులు పూర్తి చేస్తామని శపథం చేసిన ప్రభుత్వం ఇప్పుడు తన వల్ల కాదని చేతులెత్తేస్తోంది. గత పదిరోజులుగా అసెంబ్లీ, ఇతర బహిరంగ సభల్లో సీఎం జగన్‌ చెప్పిన మాటలు చూస్తే ఈ విషయం స్పష్టమౌతోంది. ‘రెండేళ్ల సమయం ఇవ్వండి.. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ స్కూళ్లతో పోటీ పడేలా చేస్తా. కార్పొరేట్‌ స్కూళ్లే ప్రభుత్వ బడులతో పోటీపడేలా చేస్తా’ అంటూ కొత్త పాట పాడుతున్నారు. నాడు-నేడు పనులు ఇప్పట్లో పూర్తి చేయలేమని స్వయంగా ముఖ్యమంత్రే పరోక్షంగా అంగీకరించారు. మరోసారి అవకాశం ఇస్తేనే నాడు-నేడు పనులు పూర్తి అవుతాయంటున్నారు. తమ ప్రభుత్వ హ యాంలో పనులు ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారు? పనుల్లో జాప్యం జరగడానికి కారణమేంటి? వంటి విషయాలను ప్రస్తావించడం లేదు.

ఇదీ షెడ్యూల్‌

ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం మొద టి దశ పనులను 2019 నవంబరులో ప్రారంభించి 2021 ఆగస్టు నాటికి పూర్తి చేయాలి. రెండో దశ పనులను 2021 ఆగస్టులో ప్రారంభించి 2022 జూలై నాటికి పూర్తి చేయాలి. మూడో దశ 2022 ఆగస్టులో ప్రారంభించి 2023 జూలై నాటికి పూర్తి చేయాలి.

ముందుకు కదలని పనులు

షెడ్యూల్‌ ప్రకారం 2019 నవంబరులో మొదటి దశ పనులు ప్రారంభించినా చెప్పిన సమయానికి పూర్తి చేయలేదు. దాదాపు 2022 వరకూ కాలం వెళ్లదీసింది. రూ.3,669 కోట్లు ఖర్చు చేసి, 15,715 పాఠశాలలను అభివృద్ధి చేసింది. ఇక రెండో దశ పనులను ఏడాది ఆలస్యంగా అంటే.. 2022 ఆగస్టులో ప్రారంభించింది. సుమారు 15 వేల బడులను ఎంపి క చేసింది. అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టడంతో ఈ సంఖ్య 22,344కు చేరింది. రెండో దశ పనులకు రూ.8 వేల కోట్లు అవసరమని అంచనా వేశారు. అయితే ఇప్పటి వరకూ ఖర్చు చేసింది కేవ లం రూ.1665 కోట్లే. ఈ విషయాన్ని ప్రభుత్వం బడ్జె ట్‌ పద్దులోనే పేర్కొంది. ఇంకా రూ.6,335 కోట్ల పను లు చేయాల్సి ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో నాడు-నేడు పథకానికి ప్రభుత్వం కేవలం రూ.3500 కోట్లే కేటాయించింది. ఇంకా రూ.2835 కోట్లు కావాలి. ఈ నిధులు ఎక్కడి నుంచి సమకూరుస్తారనే విషయాన్ని ప్రభుత్వం చెప్పడం లేదు. చేపట్టిన రూ. 1751 కోట్ల విలువైన పనులకు కూడా బిల్లులు పూర్తి గా ఇవ్వలేదు. సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం తో ప్రధానోపాధ్యాయులు, తల్లిదండ్రుల కమిటీలు పనులపై ఆసక్తి చూపడం లేదు. దీంతో చాలా చోట్ల పనులు ఆగిపోయాయి. నాడు- నేడు పనులు ముం దుకు కదలని పరిస్థితి ఏర్పడింది.

అయితే, మంత్రి బొత్స సత్యనారాయణ మాత్రం గత నెల 27వ తేదీ న 1300 కోట్లు నాడు-నేడు కింద విడుదల చేశామ ని.. ఒక్క రూపాయికూడా బకాయి లేదని తెలిపారు. కానీ, నాడు-నేడు అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రం ఇప్పటికీ 1700 కోట్లకుపైగా పనులు మాత్రమే చేసినట్టు చూపిస్తున్నారు. ప్రభుత్వం పేరుకు ప్రతిష్టాత్మక పథకమని చెప్పినా మొదట్నుంచీ దీనిపై పూ ర్తిగా శ్రద్ధ పెట్టిన దాఖలాలు లేవు. నిర్మాణ పనులను హెచ్‌ఎంలు, తల్లిదండ్రుల కమిటీలతో చేయిస్తున్నారు. పేరుకు తల్లిదండ్రుల కమిటీలున్నా వాస్తవానికి వారి పాత్ర ఏదీ లేదు. విద్యుద్దీకరణ వస్తువులు, టైల్స్‌, ఇసుక, సిమెంట్‌ను ప్రభుత్వం సరఫరా చేస్తున్నప్పటికీ నిర్మాణ వ్యయంపై శ్రద్ధ చూపడం లేదు. తాపీ మేస్ర్తీలను మాట్లాడుకోవడం, బిల్లులు వచ్చినా రాకపోయినా వారికి కూలి ఖర్చులు ఇవ్వ డం లాంటి భారం హెచ్‌ఎంలపై పడుతోంది.

స్పందించని కాంట్రాక్టర్లు

బెంచీలు, టైల్స్‌, పెయింట్లు, ఫ్యాన్లు, ఆర్వో ప్లాంట్లు లాంటివి ఏపీ విద్యా సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(ఏపీఈడబ్ల్యూఐడీసీ) ద్వారా సేకరిస్తున్నారు. రెండో దశ పనులకు సుమా రు రూ.2 వేల కోట్ల విలువైన నిర్మాణ సామగ్రి, వస్తువులు ఈ సంస్థే కొనుగోలు చేస్తుంది. రెండో దశ పనులకు గత ఆరు నెలలుగా టెండర్లు పిలుస్తు న్నా కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. పెయిం ట్లు వేసేందుకు ఎవరూ రావడం లేదని తెలిసింది. విద్యుత్‌ లైట్లు, ఫ్యాన్ల టెండర్లు కూడా ఖరారు కాలే దు. సకాలంలో బిల్లులు ఇవ్వట్లేదని కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదు.

Updated Date - 2023-04-03T14:24:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising