ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Posts: టెన్త్ ఉత్తీర్ణతతో కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో పోస్టులు

ABN, First Publish Date - 2023-03-08T12:12:00+05:30

భారత ప్రభుత్వ పర్సనల్‌, పబ్లిక్‌ గ్రీవెన్సెస్‌ అండ్‌ పెన్షన్స్‌ మంత్రిత్వశాఖకు చెందిన స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ (Staff Selection Commission) (ఎస్‌ఎస్‌సీ)... వివిధ కేంద్ర ప్రభుత్వ

కేంద్ర ప్రభుత్వ పోస్టులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

భారత ప్రభుత్వ పర్సనల్‌, పబ్లిక్‌ గ్రీవెన్సెస్‌ అండ్‌ పెన్షన్స్‌ మంత్రిత్వశాఖకు చెందిన స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ (Staff Selection Commission) (ఎస్‌ఎస్‌సీ)... వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ‘సెలెక్షన్‌ పోస్టు’ల భర్తీకి నోటిఫికేషన్‌ (Notification) విడుదల చేసింది. మొత్తం 5369 ఖాళీలు ఉన్నాయి. పోస్టులను అనుసరించి పదో తరగతి (Tenth class) నుంచి బ్యాచిలర్స్‌ డిగ్రీ (Bachelors degree) వరకు ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టులు: ఇన్వెస్టిగేటర్‌ గ్రేడ్‌-2, డేటా ప్రాసెసింగ్‌ అసిస్టెంట్‌, లైబ్రరీ ఇన్ఫర్మేషన్‌ అసిస్టెంట్‌, హిందీ టైపిస్ట్‌, సౌండ్‌ టెక్నీషియన్‌, అకౌంటెంట్‌, ప్లానింగ్‌ అసిస్టెంట్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌, సీనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌, టెక్స్‌టైల్‌ డిజైనర్‌, రిసెర్చ్‌ ఇన్వెస్టిగేటర్‌, రిసెర్చ్‌ అసిస్టెంట్‌, ల్యాబొరేటరీ అసిస్టెంట్‌, జూనియర్‌ కంప్యూటర్‌, లైబ్రరీ-కమ్‌-ఇన్ఫర్మేషన్‌ అసిస్టెంట్‌, సెక్షన్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ ప్లాంట్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌, జూనియర్‌ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌, డ్రాఫ్ట్స్‌మన్‌, ప్రాసెసింగ్‌ అసిస్టెంట్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌, అసిస్టెంట్‌ వెల్ఫేర్‌ అడ్మినిస్ట్రేటర్‌, నేవిగేషనల్‌ అసిస్టెంట్‌ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్‌, హయ్యర్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌, గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత.

వయసు: 18-30 ఏళ్లు ఉండాలి. ఎస్సీ /ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: స్కిల్‌ టెస్ట్‌/కంప్యూటర్‌ ప్రొఫిషియెన్సీ టెస్ట్‌/డేటా ఎంట్రీ టెస్ట్‌/కంప్యూటర్‌ పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం: పరీక్ష వ్యవధి 60 నిమిషాలు. కనీస అర్హతలు(మెట్రిక్యులేషన్‌), ఇంటర్మీడియట్‌(హయ్యర్‌ సెకండరీ), డిగ్రీ ఆపై అర్హతలున్న అభ్యర్థులను అనుసరించి మూడు రకాల కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్షలు ఉంటాయి. ప్రశ్న పత్రం 200 మార్కులకు ఉంటుంది. ప్రశ్నలు మల్టిపుల్‌ చాయిస్‌ విధానంలో ఉంటాయి. జనరల్‌ ఇంటెలిజెన్స్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, ఇంగ్లీష్‌ విభాగాల నుంచి 25 ప్రశ్నల చొప్పున ఇస్తారు. ప్రతి విభాగానికి 50 మార్కులు కేటాయించారు. నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంటుంది. తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికి 0.50 మార్కు కట్‌ చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా

దరఖాస్తు ఫీజు: రూ.100

దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 27

ఆన్‌లైన్‌ పేమెంట్‌ చివరి తేదీ: మార్చి 28

కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష: 2023 జూన్‌- జూలై

వెబ్‌సైట్‌: https://ssc.nic.in/

ఇది కూడా చదవండి: Free Beer Offer: రెండు బీర్లు ఫ్రీ అంటూ ఊరంతా పోస్టర్లు.. ఒకే ఒక్క కండీషన్ పెట్టినా క్యూ కట్టిన జనం..!

Updated Date - 2023-03-08T12:12:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising