Jobs: టెన్త్ ఉత్తీర్ణతతో పలాస కిడ్నీ రిసెర్చ్ సెంటర్‌లో పోస్టులు
ABN, First Publish Date - 2023-03-24T16:27:55+05:30
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా పలాసలోని కిడ్నీ రిసెర్చ్ సెంటర్ అండ్ డయాలిసిస్ యూనిట్‌లో తాత్కాలిక ప్రాతిపదికన
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా పలాసలోని కిడ్నీ రిసెర్చ్ సెంటర్ అండ్ డయాలిసిస్ యూనిట్‌లో తాత్కాలిక ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: జూనియర్ అసిస్టెంట్, ఓటీ అసిస్టెంట్, ల్యాబొరేటరీ టెక్నీషియన్, సోషల్ వర్కర్, సపోర్టింగ్ స్టాఫ్, సెక్యూరిటీ గార్డ్ తదితరాలు.
అర్హత:
1. సెక్యూరిటీ గార్డ్/జనరల్ డ్యూటీ అటెండెంట్లు: ఎస్‌ఎస్‌సీ/10వ తరగతి ఉత్తీర్ణత.
జీతభత్యాలు: నెలకు రూ.15,000 చెల్లిస్తారు
2. సపోర్టింగ్ స్టాఫ్/జనరల్ డ్యూటీ అటెండెంట్లు: ఎస్‌ఎస్‌సీ/10వ తరగతి
జీతభత్యాలు: నెలకు రూ.15,000 చెల్లిస్తారు
3. సోషల్ వర్కర్: బీఏ/బీఎస్‌డబ్ల్యూ/ఎంఏ/ఎంఎస్‌డబ్ల్యూ ఉత్తీర్ణత
జీతభత్యాలు: నెలకు రూ.21.500 చెల్లిస్తారు
4. సీఆర్మ్ టెక్నీషియన్: డీఎంఐటీ కోర్సు ఉత్తీర్ణత
జీతభత్యాలు: నెలకు రూ.32,670
5. ల్యాబొరేటరీ టెక్నీషియన్: టీఎంఎల్‌టీ/బీఎస్సీ ఎంఎల్‌టీ ఉత్తీర్ణత.
జీతభత్యాలు: నెలకు రూ.28,000
6. డయాలిసిస్ టెక్నీషియన్: డిప్లొమా ఉత్తీర్ణత.
జీతభత్యాలు: నెలకు రూ.32,670 చెల్లిస్తారు
7. ఓటీ అసిస్టెంట్: 7వ తరగతి ఉత్తీర్ణత
జీతభత్యాలు: నెలకు రూ.15,000
8. రిజిస్ట్రేషన్ క్లర్క్: గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత
జీతభత్యాలు: నెలకు 18,500 చెల్లిస్తారు
9. జూనియర్ అసిస్టెంట్: గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత
జీతభత్యాలు: నెలకు రూ.18,500 చెల్లిస్తారు
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా
చిరునామా: సూపరింటెండెంట్, జీజీహెచ్, శ్రీకాకుళం
దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 31
వెబ్‌సైట్: https://srikakulam.ap.gov.in/notice_category/recruitment/
Updated Date - 2023-03-24T16:27:55+05:30 IST