ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TSPSC: కొలువులకు కొండంత పోటీ.. చివర్లో భారీగా అర్జీలు

ABN, First Publish Date - 2023-02-24T11:20:10+05:30

కొలువులు (Jobs) ఉన్నవే కాసింత.. వాటి కోసం వచ్చిన దరఖాస్తులు కొండంత.. తెలంగాణ (Telangana)లో రాక రాక వచ్చిన గ్రూప్స్‌ ఉద్యోగాల కోసం తీవ్ర పోటీ నెలకొంది. చాలా ఏళ్ల తర్వాత సర్కారు

దరఖాస్తుల వెల్లువ..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గ్రూప్స్‌ ఉద్యోగాలకు దరఖాస్తుల వెల్లువ..

పోస్టులు 10 వేలు.. అప్లికేషన్లు 24 లక్షలు

చివరి గంటల్లో భారీగా వస్తున్న అర్జీలు

ముగిసిన గ్రూప్‌-3 దరఖాస్తుల గడువు

5,36,477 మంది అభ్యర్థుల అప్లికేషన్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): కొలువులు (Jobs) ఉన్నవే కాసింత.. వాటి కోసం వచ్చిన దరఖాస్తులు కొండంత.. తెలంగాణ (Telangana)లో రాక రాక వచ్చిన గ్రూప్స్‌ ఉద్యోగాల కోసం తీవ్ర పోటీ నెలకొంది. చాలా ఏళ్ల తర్వాత సర్కారు కొలువులకు నోటిఫికేషన్‌ (Notification) రావడంతో లక్షల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రూప్‌ 1,2,3,4 పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం (Kcr government) ఇటీవల ప్రకటన విడుదల చేసింది. వీటికి సంబంధించి మొత్తం 10,690 పోస్టులు ఉన్నాయి. ఇందులో గ్రూప్‌-1లో 503 పోస్టులు, గ్రూప్‌-2లో 783, గ్రూప్‌-3లో 1,365, గ్రూప్‌-4లో 8,039 పోస్టులు ఉన్నాయి. గ్రూప్‌-1,2,4 పోస్టులకు దరఖాస్తుల గడువు ఇప్పటికే ముగియగా, గ్రూప్‌-3 గడువు శుక్రవారం ముగిసింది. ఈ పోస్టుల కోసం 5,36,477 మంది అభ్యర్థులు దరఖాస్తులను చేసుకున్నారు. కాగా, గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష ఇప్పటికే ముగిసింది. మెయిన్స్‌ పరీక్షలను జూన్‌ 5 నుంచి 12 వరకు నిర్వహిస్తామని టీఎస్‌పీఎస్సీ (Tspsc) ఇప్పటికే ప్రకటించింది.

గ్రూప్‌-4 పరీక్షను జూలై 1న నిర్వహించాలని నిర్ణయించారు. గ్రూప్‌-2,3 పరీక్షల తేదీలను ప్రకటించలేదు. గ్రూప్‌-3 పరీక్ష జూలై, ఆగస్టు నెలల్లో జరిగే అవకాశం ఉంది. పలు నోటిఫికేషన్లకు చివరి నిమిషంలో దరఖాస్తులు చేసే అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. దరఖాస్తుల దాఖలుకు 30-40 రోజుల గడువు ఇస్తున్నా.. చివరి గంటల్లోనే పెద్ద ఎత్తున అభ్యర్థులు దరఖాస్తులు చేసుకుంటున్నారు. టీఎస్‌పీఎస్సీ ఆధ్వర్యంలో గత ఏడాది కాలంలో ఇప్పటి వరకు 26 నోటిఫికేషన్లను జారీ చేశారు. ఇందులో భాగంగా 17,134 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. గ్రూప్‌-1 పోస్టులకు సంబంధించి మొదటి వారంలో 13 శాతం దరఖాస్తులు రాగా, చివరి వారంలో ఏకంగా 40 శాతం దరఖాస్తులు నమోదయ్యాయి. చివరి రెండు రోజుల్లోనే 22.37 శాతం దరఖాస్తులు వచ్చాయి. గ్రూప్‌-4 ఉద్యోగాల కోసం మొదటి వారంలో 24.66 శాతం, చివరి వారంలో 25.25 శాతం దరఖాస్తులు వచ్చాయి. గ్రూప్‌-2 పోస్టులకు మొదటి వారంలో 27.77 శాతం, చివరి వారంలో 28.68 శాతం దరఖాస్తులు దాఖలయ్యాయి. గ్రూప్‌-3 ఉద్యోగాలకు మొదటి వారంలో 36.18 శాతం, చివరి వారంలో 25.50 శాతం దరఖాస్తులు వచ్చాయి. ఏఈఈ, సీడీపీవో, పాలిటెక్నికల్‌ లెక్చెరర్లు, అగ్రికల్చర్‌ ఆఫీసర్‌ వంటి పోస్టులకు ఇలాగే దరఖాస్తులు దాఖలయ్యాయి. ఇలా చివరి నిమిషంలో దరఖాస్తులు చేసుకోవడం వల్ల అనేక తప్పులు దొర్లుతున్నాయని అధికారులు చెబుతున్నారు. దీనిని నివారించడానికి కాస్త ముందుగానే దరఖాస్తులు చేసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఆర్టీసీ బస్సులో ఓ యువతిపై మూత్ర విసర్జన చేసిన 25 ఏళ్ల యువకుడు.. విమానంలోనే కాదు.. బస్సులోనూ అదే సీన్ రిపీట్..!

Updated Date - 2023-02-24T11:20:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising