ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నార్మ్‌లో పీజీడీఎం అగ్రిబిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ ప్రవేశాలు

ABN, First Publish Date - 2023-02-18T18:02:36+05:30

హైదరాబాద్‌ (Hyderabad)-రాజేంద్రనగర్‌ (Rajendranagar)లోని ఐకార్‌ నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రిసెర్చ్‌ మేనేజ్‌మెంట్‌(నార్మ్‌)- ‘పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (అగ్రిబిజినెస్‌ మేనేజ్‌మెంట్‌)’ ప్రోగ్రామ్‌లో

ప్రవేశాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (Hyderabad)-రాజేంద్రనగర్‌ (Rajendranagar)లోని ఐకార్‌ నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రిసెర్చ్‌ మేనేజ్‌మెంట్‌(నార్మ్‌)- ‘పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (అగ్రిబిజినెస్‌ మేనేజ్‌మెంట్‌)’ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇది రెండేళ్ల వ్యవధి గల రెసిడెన్షియల్‌ ప్రోగ్రామ్‌. ఇందులో ఆరు ట్రైమెస్టర్లు ఉంటాయి. ప్రోగ్రామ్‌లో భాగంగా ఆరు నుంచి ఎనిమిది వారాల సమ్మర్‌ ఇంటర్న్‌షిప్‌, 12 వారాల బిజినెస్‌ బూట్‌ క్యాంప్‌, 13 వారాల ప్రాజెక్ట్‌ వర్క్‌ ఉంటాయి. ఇందులో మొత్తం 66 సీట్లు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వేషన్‌లు వర్తిస్తాయి. దీనికి ఏఐసీటీఈ గుర్తింపు ఉంది.

అర్హత: యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి అగ్రికల్చర్‌, అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, కమర్షియల్‌ అగ్రికల్చర్‌, అగ్రికల్చరల్‌ మార్కెటింగ్‌ అండ్‌ కోఆపరేషన్‌, అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌, అగ్రికల్చరల్‌ బయోటెక్నాలజీ, డెయిరీ సైన్స్‌/ టెక్నాలజీ, ఫిషరీస్‌, ఫుడ్‌ టెక్నాలజీ/ఫుడ్‌ ప్రాసెస్‌ ఇంజనీరింగ్‌, ఫారెస్ట్రీ, హార్టికల్చర్‌, సెరికల్చర్‌, వెటర్నరీ సైన్స్‌ విభాగాలకు సంబంధించి ఒకదానిలో నాలుగేళ్ల డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. పదోతరగతి నుంచి డిగ్రీ స్థాయి వరకు ప్రథమ శ్రేణి మార్కులు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అయిదు శాతం సడలింపు వర్తిస్తుంది. క్యాట్‌ 2022/ సీమ్యాట్‌ 2023 స్కోర్‌ తప్పనిసరి. సంబంధిత రంగంలో కనీసం ఆర్నెల్ల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.

ఎంపిక: క్యాట్‌ 2022/ సీమ్యాట్‌ 2023 స్కోర్‌ ఆధారంగా 1:5 నిష్పత్తిలో (ఒక సీటుకి అయిదుగురిని) అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేసి ఇంటర్వ్యూకి పిలుస్తారు. వీరికి అనలిటికల్‌ రైటింగ్‌ స్కిల్‌ టెస్ట్‌, షార్ట్‌ ప్రజంటేషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. హైదరాబాద్‌ సెంటర్లో ఆఫ్‌లైన్‌ మోడ్‌లో; న్యూఢిల్లీ, కోల్‌కతా, భువనేశ్వర్‌, నాగ్‌పూర్‌, కొచ్చి సెంటర్లలో ఆన్‌లైన్‌ మోడ్‌లో ఈ ప్రక్రియలు ఉంటాయి. అభ్యర్థులు తమకు అనువైన రెండు సెంటర్లను దరఖాస్తులో సూచించాలి. క్యాట్‌/ సీమ్యాట్‌ స్కోర్‌కు 40 శాతం, పర్సనల్‌ ఇంటర్వ్యూకి 20 శాతం, అనలిటికల్‌ రైటింగ్‌ స్కిల్‌ టెస్ట్‌కు 10 శాతం, షార్ట్‌ ప్రజంటేషన్‌కు 10 శాతం, అనుభవానికి 5 శాతం, అకడమిక్‌ ప్రతిభకు 10 శాతం, డైవర్సిటీ ఫ్యాక్టర్‌కు 5 శాతం వెయిటేజీ ఇస్తూ అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.2,000; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1000

చివరి తేదీ: ఫిబ్రవరి 28

వెబ్‌సైట్‌: naarm.org.in/

Updated Date - 2023-02-18T18:02:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising