ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gurukul posts: గురుకుల పోస్టులు ఇలా కొట్టేయండి!

ABN, First Publish Date - 2023-04-17T10:55:02+05:30

రాష్ట్రం (Telangana)లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లోని ఖాళీ పోస్టుల (Gurukul posts) భర్తీకి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా

Gurukul posts
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గురుకుల పోస్టుల నోటిఫికేషన్‌ నేడే

తొలుత 2,876 పోస్టుల భర్తీకి జారీ

డిగ్రీ కాలేజీల్లో 868, జూ.కాలేజీల్లో 2,008 పోస్టులు

మే 17 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం

నోటిఫికేషన్‌లో తేలనున్న జోనల్‌, మల్టీ జోనల్‌ వివరాలు

మొత్తం 9,231 పోస్టుల భర్తీకి 5న సర్కారు ప్రకటన

మిగతా పోస్టులకు ఈ నెల 27, 28న నోటిఫికేషన్లు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రం (Telangana)లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లోని ఖాళీ పోస్టుల (Gurukul posts) భర్తీకి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా సోమవారం మొదటి నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. గురుకులాల్లో 9231 పోస్టులను డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ విధానంలో భర్తీ చేసేందుకు తెలంగాణ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ట్రిబ్‌) ఈ నెల 5న ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా, ముందుగా జూనియర్‌ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లోని బోధన, బోధనేతర పోస్టులకు కలిపి మొత్తం 2876 పోస్టుల భర్తీకి అధికారులు నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. వీటిలో డిగ్రీ కాలేజీల్లో 868 పోస్టులు, జూనియర్‌ కాలేజీల్లో 2008 పోస్టులు ఉండనున్నాయి. ఇక మిగతా 6355 పోస్టులకు ఈ నెల 24, 28 తేదీల్లో మరో నోటిఫికేషన్‌ విడుదల కానుంది. సోమవారం నోటిఫికేషన్‌ విడుదలయ్యే పో స్టులకు దరఖాస్తు చేసుకునేందుకు మే 17వరకు అవకాశం ఉండనుంది. ఇందుకు ముందుగానే అభ్యర్థులు వన్‌ టైం రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేసుకోవాల్సి ఉంది. ఇందుకోసం నియామక బోర్డు ఈనెల 12 నుంచే ఓటీఆర్‌ను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది.

తేలనున్న అర్హతలు, జోనల్‌ వివరాలు..

డిగ్రీ, జూనియర్‌ కాలేజీల్లోని 2876 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల కానున్న నేపథ్యంలో దరఖాస్తుకు అవసరమైన అర్హతలు, కేటగిరీ, రిజర్వేషన్ల వివరాలు అన్నీ తేలనున్నాయి. వీటితో పాటు జోనల్‌, మల్టీజోనల్‌, జిల్లాల్లో ఎన్ని పోస్టులు భర్తీకానున్నాయనే అంశాల్లోనూ స్పష్టతరానుంది. కాగా, డిగ్రీ కాలేజీల్లో భర్తీ చేయబోయే లెక్చరర్‌, ఫిజికల్‌ డైరెక్టర్‌, లైబ్రేరియన్‌ పోస్టులకు వేతన స్కేలు రూ.58,850 నుంచి రూ.1,37,050 వరకు అందనుంది. జూనియర్‌ కాలేజీల్లోని జూనియర్‌ లెక్చరర్‌, ఫిజికల్‌ డైరెక్టర్‌, లైబ్రేరియన్‌ పోస్టులకు రూ.54,420 నుంచి రూ.1,33,630 వరకు వేతన స్కేలు ఉంది. డిగ్రీ కాలేజీ పోస్టులు ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో భర్తీ అవుతుండగా, జూనియర్‌ కాలేజీల్లో ఈ మూడింటితోపాటు మైనారిటీ గురుకులాల్లోనూ భర్తీ కానున్నాయి. డిగ్రీ కాలేజీల్లో భర్తీ చేసే పోస్టుల్లో ఎస్సీ గురుకులాల్లో 174, ట్రైబల్‌ వెల్ఫేర్‌లో 287, బీసీ గురుకులాల్లో 407 పోస్టులు ఉంటా యి. ఇక జూనియర్‌ కాలేజీల్లో భర్తీ చేసే పోస్టుల్లో ఎస్సీ గురుకులాల్లో 253, ట్రైబల్‌ వెల్ఫేర్‌లో 291, బీసీ గురుకులాల్లో 1070, మైనారిటీ గురుకులాల్లో 394 పోస్టులు ఉండనున్నాయి. వీటిలో జూనియర్‌ కాలేజీల్లో అధికంగా గణితం పోస్టులు 324 భర్తీ అవుతుండగా, డిగ్రీ కాలేజీల్లో కంప్యూటర్‌ సైన్స్‌ పోస్టులు 99 భర్తీ కానున్నాయి.

Updated Date - 2023-04-17T10:55:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising