ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏడాదిలోపే జగన్ సర్కార్ రివర్స్‌ గేర్‌! బోర్ కొట్టేయడానికి కారణమిదేనా?

ABN, First Publish Date - 2023-04-10T11:45:05+05:30

పాఠశాల విద్యపై వైసీపీ ప్రభుత్వం (YCP Government) ఏడాదికో ప్రయోగం చేస్తోంది. ఈ విద్యా సంవత్సరంలో తరగతులు విలీనంచేసి గందరగోళం చేసిన ప్రభుత్వం, ఇప్పుడు ఈ-కంటెంట్‌ అంటూ

Education
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

బైజూస్‌కు బైబై!

ఏడాదిలోపే బోర్‌ కొట్టేసిందా?

రూ.778 కోట్ల కంటెంట్‌పై రివర్స్‌ గేర్‌

సొంత కంటెంట్‌ రూపకల్పనకు కసరత్తు

రెండేళ్లలోనే రెండు రకాల ప్రయోగాలు

ఈ ఏడాది బైజూస్‌ కంటెంట్‌తో పాఠాలు

వందల కోట్లు పెట్టి ట్యాబ్‌ల కొనుగోలు

వాటితో కనిపించని ప్రయోజనం

పిల్లలతోపాటు టీచర్లపైనా భారం

ఇప్పుడు మళ్లీ కొత్త కంటెంట్‌కు వ్యయం

పిల్లలపై జగన్‌ ప్రభుత్వం ప్రయోగాలు

‘‘బైజూస్‌ ఇచ్చే కంటెంట్‌ ఎంతో విలువైంది. దానివిలువ రూ.778 కోట్లు దాకా ఉంటుంది. ఈ కంటెంట్‌ను బైజూస్‌ ఉచితంగానే మనకు ఇవ్వడానికి ముందుకొచ్చింది’’

..2022 జూన్‌లో బైజూస్‌ సంస్థతో ఎంవోయూ చేసుకుంటూ సీఎం జగన్‌ అన్న మాటలివి. అన్ని వందల కోట్ల కంటెంట్‌ను రాష్ట్రానికి ఉచితంగానే ఇస్తున్నారా అంటూ అప్పట్లో ప్రజలు ఆశ్చర్యపోయారు. కానీ, ఏడాదిలోపే ఆ కంటెంట్‌ పనికిరాదు పొమ్మంటోంది జగన్‌ సర్కారు. భారీ ఖర్చుచేసి కొత్త కంటెంట్‌ కోసం కసరత్తు ప్రారంభించింది. తద్వారా దేనిలోనూ తనకు స్పష్టతలేదనే విషయం తానుగానే బయటపెట్టుకుంది.

(అమరావతి, ఆంధ్రజ్యోతి): పాఠశాల విద్యపై వైసీపీ ప్రభుత్వం (YCP Government) ఏడాదికో ప్రయోగం చేస్తోంది. ఈ విద్యా సంవత్సరంలో తరగతులు విలీనంచేసి గందరగోళం చేసిన ప్రభుత్వం, ఇప్పుడు ఈ-కంటెంట్‌ అంటూ మరో ప్రయోగానికి తెరదీసింది. ఇప్పటికే దాదాపు రూ.688 కోట్లు ఖర్చు చేసి పిల్లలకు బైజూస్‌ ట్యాబ్‌లు (Byjus) కొనుగోలు చేసి ఇచ్చారు. ఇప్పుడు అదనంగా కొత్త కంటెంట్‌ తయారీకి పూనుకున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి సొంత కంటెంట్‌ అందుబాటులోకి వస్తుందంటూ రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్‌టీ) కొత్త హడావుడి ప్రారంభించింది. అలా అయితే ఈ ఏడాది ఆర్భాటంగా ప్రారంభించిన బైజూస్‌ కంటెంట్‌ను ఏంచేస్తారు? సీఎం జగన్‌ (CM JAGAN) చెప్పిన రూ.778కోట్ల కంటెంట్‌ ఏమైపోతుంది? ఆహా ఓహో అని పొగడ్తల వర్షం కురిపించిన బైజూస్‌ కంటెంట్‌పై ఒక్క ఏడాదిలోనే ఎందుకు నమ్మకం పోయింది? భారీగా ఖర్చు చేసి కొత్తగా కంటెంట్‌ తయారుచేయాల్సిన అవసరం ఏమొచ్చింది? వంటి అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. మునిగిపోయే పడవలా ఉన్న బైజూస్‌కు అప్పట్లో ప్రభుత్వం బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారింది. అయితే, ఏడాదిలోనే దాన్ని వదిలించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీంతో వైసీపీ ప్రభుత్వానికి ఎందులోనూ స్పష్టత లేదని మరోసారి బయటపడింది.

అప్పట్లో ఆర్భాటం..

2022 డిసెంబరు 21న ప్రభుత్వం ఎనిమిదో తరగతి పిల్లలకు, వారికి పాఠాలు చెప్పే టీచర్లకు బైజూస్‌ కంటెంట్‌ నింపిన ట్యాబ్‌లు పంపిణీ చేసింది. 4.59లక్షల మంది విద్యార్థులు, 59వేల మంది టీచర్లకు కలిపి మొత్తం 5,18,740 ట్యాబ్‌లు ఇచ్చింది. ఇందుకోసం రూ.688 కోట్లు ఖర్చు చేసింది. అంతకముందు కంటెంట్‌ను ఉచితంగా ఇచ్చేందుకు బైజూస్‌ సంస్థతో 2002 జూన్‌లో ఎంవోయూ చేసుకుంది. పైగా కంటెంట్‌ ఎంతో విలువైందని, దాని విలువ అక్షరాలా రూ.778 కోట్లు అని సీఎం జగన్‌ ప్రకటించారు. ట్యాబ్‌ల పంపిణీ సమయంలోనూ ఇదే చెప్పారు. ‘‘రూ.686 కోట్ల వ్యయంతో 4.59లక్షల ట్యాబ్‌లు పేద పిల్లలకు పంపిణీ చేస్తున్నాం. ఇకపై ప్రతి ఏడాది ఎనిమిదో తరగతిలోకి వచ్చే ప్రతి విద్యార్థికీ ట్యాబ్‌లు ఇస్తాం. ఇందులోని కంటెంట్‌ ఇంగ్లీ్‌షతో పాటు తెలుగులో కూడా ఉంటుంది. సులభంగా అర్థంచేసుకునే అవకాశం బైజూస్‌ కంటెంట్‌ ద్వారా లభిస్తుంది. నాలుగో తరగతి నుంచి పదో తరగతి పిల్లలకు చక్కటి కంటెంట్‌ను బైజూస్‌ ఇస్తోంది.

ఇలాంటి ట్యాబ్‌ తీసుకుని బైజూస్‌ కంటెంట్‌ కొనుగోలు చేయాలంటే అక్షరాలా మార్కెట్‌ విలువ ఒక్కో విద్యార్థికి రూ.32వేలు ఖర్చవుతుంది. ఇందులో ట్యాబ్‌ విలువ రూ.16500. బైజూస్‌ కంటెంట్‌ను పిల్లలు డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే దాని ఖర్చు రూ.15500. ఇదంతా ఉచితంగా ఇస్తున్నాం. అంత కంటెంట్‌ను బైజూస్‌ ఉచితంగా ఇస్తోంది. ఇందుకోసం వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నా. మొత్తం బైజూస్‌ కంటెంట్‌ విలువ రూ.778 కోట్లు’’ అని తెలిపారు. కానీ ఏడాది లోపే అన్ని వందల కోట్ల కంటెంట్‌ తమకు పనికిరాదు అనే ఆలోచనకు ప్రభుత్వం వచ్చింది. సమాంతరంగా సొంత కంటెంట్‌ తయారుచేస్తోంది. ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లలో బైజూస్‌ కంటెంట్‌ లోడ్‌ చేయగా, 4 నుంచి 10 తరగతులు, మిగిలిన విద్యార్థులకు వారి సొంత ఫోన్లలో కంటెంట్‌ అప్‌లోడ్‌ చేసింది. ఇలా 4 నుంచి 10 తరగతులకు బైజూస్‌ కంటెంట్‌ ఇవ్వగా, ఎస్‌సీఈఆర్‌టీ సొంత కంటెంట్‌ రూపకల్పనకు తెరతీసింది. 2023-24 విద్యా సంవత్సరం నుంచి దానిన్ని విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురాబోతోంది. అంటే ఒక్క ఏడాదితోనే బైజూస్‌కు దాదాపుగా బైబై చెప్పేందుకు సిద్ధమైంది.

సబ్జెక్టులు, లాంగ్వేజ్‌లు

బైజూస్‌ కేవలం సబ్జెక్టుల కంటెంట్‌ మాత్రమే ఇస్తోంది. గణితం, సైన్స్‌, సోషల్‌ సబ్జెక్టుల ఈ-కంటెంట్‌ను విద్యార్థులకు అందిస్తోంది. అయితే ఇప్పుడు ఎస్‌సీఈఆర్‌టీ వాటితోపాటు భాషాసబ్జెక్టుల కంటెంట్‌ను కూడా తయారుచేస్తోంది. తెలుగు, ఇంగ్లిష్‌, హిందీ కంటెంట్‌ కూడా ఇస్తామని అధికారులు అంటున్నారు. 4 నుంచి 9 తరగతుల వరకు సీబీఎ్‌సఈ సిలబస్‌ కంటెంట్‌ కూడా రూపొందిస్తున్నారు. ఇందుకోసం విద్యార్థులకు ఒక మొబైల్‌ యాప్‌ను తయారుచేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి దానిని వినియోగంలోకి ప్రభుత్వం తీసుకురానుంది. ఇందుకోసం భారీగా ఖర్చు చేస్తున్నట్లు తెలిసింది. వైసీపీ ప్రభుత్వ వ్యవహార శైలి చూస్తే టీచర్ల బోధనే అక్కర్లేదని, మొత్తం ఈ-కంటెంట్‌తోనే పిల్లలు చదువుకుంటారని అన్నట్టుగా కనిపిస్తోంది. ఈ విద్యా సంవత్సరంలో ట్యాబ్‌లు ఇవ్వడంతో పాటు వాటిని ప్రతిరోజూ కనీసం గంట సేపు చూడాలంటూ టీచర్లకు కండీషన్‌ పెట్టింది. అసలు ఇన్నేళ్లుగా పాఠాలు చెబుతున్న టీచర్లు....బైజూ్‌సను చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి? బోధనలో వారి ఇన్నేళ్ల అనుభవం కంటే బైజూస్‌ గొప్పదా? అనే పలు ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. అయినా కచ్చితంగా చూడాల్సిందేనంటూ ప్రభుత్వం వారిపై బైజూ్‌సను బలవంతంగా రుద్దింది. పోనీ దానివల్ల ఏవైనా ఫలితాలు వచ్చాయా? అంటే అదీ లేదు. బైజూస్‌ కంటెంట్‌ చూసి విద్యార్థులు కొత్తగా ఏదైనా నేర్చుకున్నారా? అనేదానిపై ఎవరికీ స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇది చాలదన్నట్టుగా కొత్త ఈ-కంటెంట్‌ను తెస్తోంది. అసలు టీచర్లే అక్కర్లేదు అన్నట్టుగా ప్రభుత్వం, పిల్లల భవిష్యత్తుపై ప్రయోగాలు చేస్తోందని ఉపాధ్యాయులు మండిపడుతున్నారు.

రెండూ ఇస్తే ఇంకా గందరగోళం

ఒకవేళ అటు బైజూస్‌, ఇటు ఎస్‌సీఈఆర్‌టీ! వాటికి చెందిన రెండు కంటెంట్లూ ఒకేసారి పిల్లలపై రుద్దితే అది ఇంకా గందరగోళానికి దారితీస్తుంది. గణితం, సైన్స్‌, సోషల్‌కు బైజూస్‌ కంటెంట్‌ను... తెలుగు, హిందీ, ఇంగ్లీ్‌షకు ఎస్‌సీఈఆర్‌టీ కంటెంట్‌ ట్యాబ్‌లు, ఫోన్లలో అప్‌లోడ్‌ చేస్తే ఏది చదవాలో, ఏది చూడాలో అర్థంకాక విద్యార్థులు ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉంది. టీచర్ల బోధనతో చదువుకుంటున్న వారిపై బలవంతంగా బైజూ్‌స రుద్దారన్న అపవాదు ఉంది. దానికితోడు ఇప్పుడు సొంత కంటెంట్‌ వస్తోంది. ‘నాడు- నేడు’లో భాగంగా ఏర్పాటుచేయబోతున్న డిజిటల్‌ తరగతుల కోసమే ఈ కంటెంట్‌ తీసుకొచ్చారనే విమర్శలూ వ్యక్తమవుతున్నాయి. ఉన్నత పాఠశాలల్లో దాదాపు రూ.350 కోట్లతో ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెళ్లు ఏర్పాటుచేయబోతున్నారు. వాటి కొనుగోలుకు టెండర్లు పిలిచారు. వాటిని కొంటున్నందునే ఈ-కంటెంట్‌ను తయారుచేస్తున్నారన్న వాదనలూ వినిపిస్తున్నాయి.

తేడా ఎక్కడొచ్చింది?

ఒప్పందం చేసుకున్న కొన్ని నెలల తర్వాత పిల్లలకు ట్యాబ్‌లు పంపిణీ చేశారు. ఈలోగా బైజూ్‌సతో ఏపీ ప్రభుత్వానికి కొంత గ్యాప్‌ ఏర్పడినట్లు ప్రచారం జరిగింది. ఆ సమయంలో జరిగిన కొన్ని సమీక్షల్లో సీఎం...బైజూస్‌ అనే పదాన్ని ఉచ్ఛరించడానికి కూడా ఇష్టపడలేదని తెలిసింది. కానీ అప్పటికే ఒప్పందం చేసుకున్నందున వేరే దారిలేక ఆ సంస్థ కంటెంట్‌తోనే ట్యాబ్‌లు పంపిణీ చేశారు. అప్పటికే ఒకసారి ల్యాప్‌టా్‌పలు ఇస్తామని మాట తప్పడంతో... రెండోసారి కూడా వాయిదా వేస్తే చెడ్డపేరు వస్తుందన్న భావనతో ట్యాబ్‌లు పంపిణీ చేసినట్లుగా విద్యాశాఖలో చర్చ జరిగింది. అప్పట్లోనే బైజూ్‌సకు ప్రత్యామ్నాయంగా సొంతంగా కంటెంట్‌ తయారుచేయడం ఎస్‌సీఈఆర్‌టీ ప్రారంభించింది. దీనిపై అప్పట్లోనే ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా... ఎస్‌సీఈఆర్‌టీ అధికారులు అదేం లేదంటూ దాటవేశారు. తీరా ఇప్పుడు హఠాత్తుగా సొంత కంటెంట్‌ను ఇవ్వబోతున్నామని చెబుతున్నారు.

Updated Date - 2023-04-10T11:46:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising