Rainy season: వానాకాలంలో ఈ పొరపాట్లు చేయకండి!
ABN , First Publish Date - 2023-07-05T11:22:19+05:30 IST
వర్షం పడే సమయంలో సాధ్యమైనంత వరకూ ఎక్కడికీ వెళ్లకపోవటం మంచిది. డ్రైనేజీ నీళ్లు వాననీళ్లలో కలసి ప్రవహించినపుడు బ్యాక్టీరియాతో వైర్‌సలు శరీరంలోకి చేరి పలు రకాల సమస్యలు సృష్టిస్తాయి. అందుకే జాగ్రత్తగా ఉండాలి.
వర్షం పడే సమయంలో సాధ్యమైనంత వరకూ ఎక్కడికీ వెళ్లకపోవటం మంచిది. డ్రైనేజీ నీళ్లు వాననీళ్లలో కలసి ప్రవహించినపుడు బ్యాక్టీరియాతో వైర్‌సలు శరీరంలోకి చేరి పలు రకాల సమస్యలు సృష్టిస్తాయి. అందుకే జాగ్రత్తగా ఉండాలి.
వర్షాకాలంలో గొడుగు లేదా రెయిన్‌కోట్‌ను వెంట తీసుకెళ్లాలి.
కరెంటు స్తంభాలు, వైర్లకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా వర్షం పడే సమయంలో రాత్రిపూట ప్రయాణాలను ఆపేయాలి.
వర్షాకాలంలోనే దోమల వృద్ధి ఎక్కువగా జరుగుతుంది. మురికి నీళ్లలో దోమలు గుడ్లు పెట్టకుండా జాగ్రత్త పడాలి. దోమలు ఎక్కువగా ఉన్నాయని కాయిల్స్ పెడతారు. ఇలా చేయటం వల్ల శ్వాస సంబంధ సమస్యలు వచ్చే అవకాశాలెక్కువ. వీటితో పాటు స్ర్పేలు చల్లటం చేస్తుంటారు. ఇవేమీ కాకుండా దోమ తెరలను వాడటం మంచిది.
ఇంట్లో ఉండే స్విచ్‌లు, ఇతర ఎలక్ర్టానిక్ పరికరాలు విషయంలో జాగ్రత్తలు అవసరం. ఏమాత్రం అలసత్వంగా ఉంటే ఎలక్ర్టిక్ షాక్‌లు కొట్టే అవకాశాలెక్కువ ఉంటాయి.
వర్షాకాలంలో నీళ్లు దప్పికగా లేవని తాగకుండా వదిలేయకూడదు. ప్రతి మనిషికి నీళ్లు అవసరం. అయితే గోరువెచ్చని నీటిని తాగాలి. దీంతో పాటు రోడ్డుపక్కన ఉండే ఆహారాల జోలికి వెళ్లకూడదు. ముఖ్యంగా తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తినాలి.
ఇంట్లో నీటితడి లేకుండా చూసుకోవాలి. చెత్త పేరుకుపోకుండా జాగ్రత్తపడాలి.