Skin Care: చర్మం ఆకర్షణీయంగా ఉండాలంటే..!
ABN , First Publish Date - 2023-11-22T12:55:16+05:30 IST
అందమైన, ఆరోగ్యకర చర్మం ఎవరైనా కోరుకుంటారు. ముఖ చర్మం మీద మచ్చల్లాంటివి రాకుండా... నునుపుగా, ఆకర్షణీయంగా ఉండాలంటే
అందమైన, ఆరోగ్యకర చర్మం ఎవరైనా కోరుకుంటారు. ముఖ చర్మం మీద మచ్చల్లాంటివి రాకుండా... నునుపుగా, ఆకర్షణీయంగా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సరి!
చర్మానికి మాయిశ్చరైజర్ అవసరం. దీనివల్ల చర్మంలో కాంతి వస్తుంది. మాయిశ్చరైజ్ చేయటమే అందానికి తొలి అడుగు.
మైల్డ్ స్క్రబ్‌తో చర్మాన్ని శుభ్రపరచుకోవటం ముఖ్యం. దీనివల్ల పేరుకు పోయిన మట్టి, ఇతర బాక్టీరియా తొలగిపోతుంది. మృతకణాలు బయటకు పోతాయి.
ఇంట్లో నిమ్మకాయ ఉంటే రెండుగా కట్ చేసి చర్మంపై రుద్దాలి. ఈ సిట్రిస్ ఆమ్లం వల్ల చర్మంమీద మంట పుడుతుంది. మొటిమల్లాంటివి తగ్గిపోతాయి.
చర్మంమీద పొక్కులు లాంటివి ఉంటే వారానికి రెండుసార్లు అలొవెరా గుజ్జును పట్టించి.. ఆరిన తర్వాత కడిగేయాలి. దీనివల్ల చర్మం శుభ్రమవుతుంది. కాంతివంతంగా మెరుస్తుంది. ఫ్రెష్‌గా ఉన్నట్లు అనిపిస్తుంది.
చర్మం జిడ్డుగా ఉంటే కొద్దిగా రోజ్‌వాటర్‌లో శనగపిండి, పసుపు కలిపి ముఖానికి పట్టించాలి. ఇలా వారానికోసారి చేయటం వల్ల చర్మం మీద నూనె శాతం తగ్గి మొటిమలు కనపడవు.
పసుపు, తేనె కలిపి చర్మానికి పట్టిస్తే చర్మం మీద ఉండే ఇరిటేషన్ పోతుంది.
తీపి పదార్థాలు తినటం తగ్గించాలి. రోజు మంచి నీళ్లు దప్పికగా ఉన్నప్పుడు కచ్చితంగా తాగాలి. సి- విటమిన్ ఉండే నిమ్మరసం, ఆకుకూరలు, చేపల్లాంటి ఆహార పదార్థాలు తినాలి.
వర్కవుట్స్ లేదా వాకింగ్ చేయాలి. దీనివల్ల ఎనర్జిటిక్‌గా ఉంటారు. చూడగానే చర్మం మిలమిలా మెరిసినట్లు కనిపిస్తుంది.
అన్నింటికంటే ముఖ్యంగా ఒత్తిడి తగ్గించుకుని.. కనీసం ఏడు గంటలు నిద్రకు కేటాయించాలి.