Rains Diseases: సీజనల్ వ్యాధులను ఈ మందులతో అడ్డుకట్ట వేయొచ్చు!
ABN, First Publish Date - 2023-08-01T17:23:33+05:30
వానలతో నీటి నిల్వ వల్ల, దోమలు పెరగడం వల్ల సీజనల్ వ్యాధులు విపరీతంగా వ్యాపిస్తున్నాయి. హోమియో మందులతో వీటికి అడ్డుకట్ట వేయవచ్చు.
వానలతో నీటి నిల్వ వల్ల, దోమలు పెరగడం వల్ల సీజనల్ వ్యాధులు విపరీతంగా వ్యాపిస్తున్నాయి. హోమియో మందులతో వీటికి అడ్డుకట్ట వేయవచ్చు.
వానాకాలంలో విజృంభించే బ్యాక్టీరియా, వైర్‌సల వల్ల జలుబు, జ్వరం, మలేరియా, టైఫాయిడ్, బ్రాంఖైటిస్ మొదలైన వ్యాధులు వ్యాపించే అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగా దోమల ద్వారా వ్యాపించే చికున్ గున్యా, డెంగ్యూలతో అప్రమత్తంగా ఉండాలి. వ్యాధులను ప్రారంభంలోనే గుర్తించి, సత్వర వైద్యం తీసుకోవడం వల్ల పరిస్థితి విషమించకుండా ఉంటుంది.
తీవ్ర జ్వరం, భరించలేని తలనొప్పి, కీళ్లు, కండరాల నొప్పులు, నీరసం, ఆకలి మందగించడం, వికారం, వాంతులు, శరీరం మీద దద్దుర్లు, చర్మం ఎర్రబడడం, అంతర్గత, బాహ్య రక్తస్రావం డెంగ్యూ ప్రధాన లక్షణాలు. పరిస్థితి తీవ్రమైతే రక్తంలో ప్లేట్‌లెట్లు తగ్గిపోతాయి. అవసరాన్ని బట్టి ఐవి ద్వారా ద్రవాలను అందిస్తూ, రక్తపోటును పరీక్షిస్తూ ఉండాలి. కొన్ని సందర్భాల్లో ప్లేట్‌లెట్ల మార్పిడి కూడా అవసరం పడవచ్చు.
హోమియో పాత్ర ఇదే!
డెంగ్యూ అనేది ఆస్రత్రిలో రోగిని నిశితంగా పరిశీలించవలసిన వ్యాధి. సంప్రదాయ ఔషధాలతో పాటు హోమియో మందులను కూడా ఇవ్వడం ద్వారా రోగి కోలుకునే సమయం వేగాన్ని పెంచవచ్చు. హోమియో మందుల్లో భాగంగా యూపటోరియం పర్ఫ్‌ను 30 పొటెన్సీతో తీసుకోగలిగితే, ప్రోత్సాహక ఫలితాలు దక్కడంతో పాటు రోగి బాధలు తగ్గి, కోలుకునే వేగం పెరుగుతుంది. రోగి లక్షణాల ఆధారంగా ఇదే ఔషధాన్ని వేర్వేరు పొటెన్సీలలో వైద్యుల సూచనలను బట్టి వాడుకోవచ్చు. అలాగే ఎకొనైట్, బెల్లడొనా, బ్రయోనియా, జెల్సీమియం, ఇపెకాక్, క్రోతాలస్, ఫాస్ఫరస్, రస్టాక్స్ వంటివి సమర్థవంతంగా పని చేస్తాయి.
ముందస్తు జాగ్రత్తలు
పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.
ఇంట్లోని నీటి ట్యాంకులు శుభ్రం చేసుకోవాలి.
కాచి వడబోసిన మంచి నీళ్లు తాగాలి.
తాజా ఆహారం, సీజనల్ ఫ్రూట్స్ తినడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది.
సంపులు, నీటి ట్యాంకుల్లోకి దోమలు ప్రవేశించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
దోమలు కుట్టకుండా దోమ తెరలు, శరీరానికి లేపనాలు వాడాలి.
డెంగీకి కారణమైన ఈజిప్టీ దోమలు పగటివేళ కుడతాయి. కాబట్టి బడుల్లో తగిన జాగ్రత్తలు పాటించేలా యాజమాన్యాలకు సూచించాలి.
-డాక్టర్ గన్నంరాజు దుర్గాప్రసాద్ రావు,సీనియర్ హోమియోపతి ఫిజీషియన్, హైదరాబాద్
Updated Date - 2023-08-01T17:24:00+05:30 IST