Stubborn Diseases: ఆ వ్యాధులను కూడా ఆట కట్టించొచ్చు!

ABN , First Publish Date - 2023-02-21T14:47:28+05:30 IST

ఆస్తమా, హెచ్‌ఐవి లాంటి మొండి వ్యాధులకు హోమియోలో సమర్థమైన మందులున్నాయి. వ్యాధుల ఆట కట్టించి, ఆరోగ్యాన్ని అందించే

Stubborn Diseases: ఆ వ్యాధులను కూడా ఆట కట్టించొచ్చు!
ఆట కట్టించొచ్చు!

ఆస్తమా, హెచ్‌ఐవి లాంటి మొండి వ్యాధులకు హోమియోలో సమర్థమైన మందులున్నాయి. వ్యాధుల ఆట కట్టించి, ఆరోగ్యాన్ని అందించే సామర్థ్యం హోమియో వైద్యానికి ఉంది.

సైనసైటిస్‌, ఆస్తమాలు మళ్లీ బాధించవు

సైనసైటిస్‌, ఆస్తమా దీర్ఘకాలం వేధించే జబ్బులని చాలా మంది అనుకుంటారు. కానీ వీటిని హోమియో (Homeo)తో శాశ్వతంగా తగ్గించే వీలుంది. సైనస్‌లో ఉండే డిఫెన్స్‌ మెకానిజం చాలా వరకూ శరీరంలోకి చొరబడకుండా సూక్ష్మజీవులను అడ్డుకుంటుంది. కానీ ఐదు మైక్రాన్ల కంటే తక్కువగా ఉండే పార్టికల్స్‌ సైన్‌సలో ఆగకుండా నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరుకుంటాయి. తుమ్ముల ద్వారా శరీరం వీటిని బయటకు పంపించే ప్రయత్నం చేస్తుంది. పురుగుమందులు ఉపయోగించి పండించిన పదార్థాలు తినడం, వాతావరణ కాలుష్యం, ఇంటి పరిసరాలు శుభ్రంగా లేకపోవడం, దుమ్ము, ధూళితో కూడిన ప్రదేశాల్లో ఎక్కువ సమయాలు గడపడం, వంటివి సైన్‌సకూ, ఆస్తమాకు దారి తీస్తాయి.

హెచ్‌ఐవి, హెర్పిస్‌ ఆటకట్టు

హెచ్‌ఐ(HIV) వి సోకితే మరణం తప్పదనే భావన ఇప్పటికీ చాలా మందిలో ఉంది. నిజానికి హోమియోలో హెచ్‌ఐవి వైరస్‌ను కట్టడి చేసే మందులున్నాయి. హెచ్‌ఐవి విస్తరించడానికి కారణం, దీని లక్షణాలు కొన్నేళ్ల తర్వాత ఆలస్యంగా బయటపడడమే! అప్పటివరకూ వారికి హెచ్‌ఐవి ఉన్న విషయం కూడా తెలియదు. రోగనిరోధకశక్తి తగ్గినప్పుడు వ్యాధి లక్షణాలు బయటపడతాయి. విరేచనాలు కావడం, బరువు తగ్గడం, ఇతరత్రా వ్యాధులు విజృంభించడం, వాతావరణ మార్పులను తట్టుకోలేకపోవడం, తేలికగా వ్యాధుల బారిన పడడం జరుగుతూ ఉంటుంది. హెర్పి్‌సలో.. పురుషాంగం మీద చమట పొక్కులు మాదిరిగా దురదతో కూడిన ఎర్రని నీటి పొక్కులు కనిపిస్తాయి. ఇవి పగిలి పుండ్లుగా మారతాయి. తగిన చికిత్స తీసుకోకుండా లైంగిక కలయిక ద్వారా ఈ పొక్కులు ఇతరులకు సోకే ప్రమాదం ఉంటుంది.

నడుం నొప్పి, మెడ నొప్పిని ఎన్నాళ్లు భరిస్తారు?

మెడ (neck), వెన్నుపాములో మార్పులు రావడం వల్ల నాడుల మీద ఒత్తిడి పెరిగి ఈ సమస్య తలెత్తుతుంది. మెడ బిగుసుకుపోయినట్టు మారడం సమస్య ప్రధాన లక్షణం. మెదడు, వెన్నుపాము నుంచి శరీరంలోకి విస్తరించే ముఖ్యమైన నాడులు మెడ ఎముక గుండానే ప్రయాణిస్తాయి. ఏదైనా కారణం వల్ల మెడ నాడుల మీద ఒత్తిడి పెరిగినప్పుడు మెడ నొప్పి మొదలవుతుంది. నిర్లక్ష్యం చేస్తే కండరాలు, రక్తనాళాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. సర్వైకల్‌ స్పాండిలోసిస్‌ సమస్య పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తుంది.

FFFF.jpg

-డాక్టర్‌ రవి కిరణ్‌

MD,M.Sc (Psych),P.G (Virology)LONDON

గోల్డ్‌ మెడల్‌ ఫర్‌ ఎక్సెలెన్సీ ఇన్‌ మెడిసన్‌, మాస్టర్స్‌ హోమియోపతి.

ఆదిలాబాద్‌, అమీర్‌పేట్‌, కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్‌, సికింద్రాబాద్‌, విజయవాడ, కరీంనగర్‌, విశాఖపట్నం, తిరుపతి, హన్మకొండ, రాజమండ్రి, గుంటూరు.

ఫోన్‌ నెంబరు: 7842108108, 040- 48106108

Updated Date - 2023-02-21T14:47:30+05:30 IST