Obesity: ఈ ఐదు ఫాలో కాకపోతే బరువు తగ్గడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా టైం వేస్ట్..!

ABN , First Publish Date - 2023-04-17T13:01:52+05:30 IST

ఊబకాయం పెరుగుతున్నదనే ఆందోళనను అధిగమించడానికి కొన్ని అలవాట్లను చేసుకోక తప్పదు.

Obesity: ఈ ఐదు ఫాలో కాకపోతే బరువు తగ్గడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా టైం వేస్ట్..!
weight loss tips

ఫిట్‌గా, ఆరోగ్యంగా ఎలా ఉండాలనే దానిమీద బోలెడు అంశాలు ప్రచారంలో ఉన్నాయి. ఇక సోషల్ మీడియా మనకు కొత్త చిట్కాలు, ట్రిక్స్‌తో ఫీడ్‌ని అందజేస్తూనే ఉంది. అన్నిసార్లూ ఇది సరైన సమాచారం కావాలనీ లేదు. అయితే మనం ప్రతిరోజూ ఏమి తింటున్నాము అనే విషయంలో సరైన అవగాహన ఉండాలి. మనం రోజువారిలో తినే ఆహారంతో, ఊబకాయం పెరుగుతున్నదనే ఆందోళనను అధిగమించడానికి కొన్ని అలవాట్లను చేసుకోక తప్పదు. బరువు పెరగడం చాలా సులభం కానీ దానిని తగ్గించడం ఎల్లప్పుడూ కష్టమే. సరైన ఆహారం, వ్యాయామంతో అధిక బరువును తగ్గించుకోవచ్చు.

ఆరోగ్యకరమైన మార్గంలో ఊబకాయంతో పోరాడటానికి..

ఊబకాయంతో పోరాడటానికి సాధారణ చిట్కాలు..

ప్రతిరోజూ మన ఉదయం ప్రారంభించే విధానమే మన మొత్తం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందట. స్థూలకాయాన్ని పోగొట్టడానికి మనం కొన్ని జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి, ముఖ్యంగా ఉదయం పూట.

1. ప్రతిరోజూ ఉదయం గోరువెచ్చని నీరు త్రాగాలి.

స్థూలకాయానికి ప్రధాన కారణం నెమ్మదిగా జరిగే జీవక్రియ. జీవక్రియను అదుపులో ఉంచడానికి, ఉదయం లేవగానే కనీసం 1 నుంచి 2 గ్లాసుల గోరువెచ్చని నీటిని తాగాలి. ఆయుర్వేదం ప్రకారం, నిమ్మకాయ, తేనె కలిపిన నీటిని తాగడం జీవక్రియను వేగవంతం చేస్తుంది. బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది.

2. వ్యాయామాన్ని వాయిదా వేయవద్దు.

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి రోజుకు కనీసం 25 నుండి 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం చాలా అవసరం. తేలికపాటి వ్యాయామాలు చురుకుదనాన్ని పెంపొందించడంలో సహాయపడతాయి. ఈ రోజుల్లో చాలా మంది జిమ్‌కి వెళ్లడానికి ఇష్టపడతారు. ఇది చాలా మంచి అలవాటు. ఇంట్లో ఉదయం తేలికపాటి వ్యాయామాలు చేయడం ద్వారా ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

ఇది కూడా చదవండి: యవ్వనంలో ఉన్నప్పుడే అనుసరించాల్సిన చర్మ సంరక్షణ పద్ధతులు ఇవే..!

3. సూర్యకాంతిలో..

విటమిన్ డి మన శరీరానికి చాలా ప్రయోజనకరమైనది. ఉదయాన్నే సూర్యుని నుండి వచ్చే మొదటి కిరణాలలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరానికి, మనస్సుకు సానుకూల శక్తిని ఇస్తుంది.

4. అల్పాహారాన్ని ఎప్పుడూ వాయిదా వేయవద్దు.

చాలా మంది ప్రజలు తమ ఉదయం అల్పాహారం బరువు తగ్గించడంలో సహాయపడుతుందనుకుంటారు. ఇది అపోహ. ఇది శరీరానికి హానికరం. సరిపడని ఆహారం మన శరీరాన్ని బలహీనపరుస్తుంది. కొన్నిసార్లు, దీర్ఘకాల ఆకలి బరువు తగ్గడానికి బదులుగా బరువు పెరగడానికి దారితీస్తుంది, ఎందుకంటే ఎక్కువసేపు ఆకలితో బాధపడటం, అతిగా తినేలా చేస్తుంది. అలాగే, శరీరంలో ముఖ్యమైన పోషకాల కొరత ఏర్పడుతుంది.

5. భోజనాన్ని ప్లాన్ చేయండి.

ప్రతిరోజూ ఉదయం, ఆరేజు తినే వస్తువుల జాబితాను వ్రాయండి. రోజులో ఏమి తినబోతున్నారో గుర్తుంచుకోవడం వల్ల, తక్కువ కేలరీల ఆహారాలను స్పృహతో ఎంచుకోవడం ముందుగానే ప్లాన్ చేసుకోవడం తినేవాటి మీద జాగ్రత్త వహిస్తారు. అలాగే ఆరోగ్యానికి బాధ్యత వహిస్తారు.

Updated Date - 2023-04-17T13:01:52+05:30 IST