ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Karni Sena Chief Murder: కర్ణిసేన చీఫ్ హత్య కేసులో ముగ్గురు అరెస్ట్

ABN, First Publish Date - 2023-12-10T08:26:11+05:30

రాజస్థాన్‌లో సంచలనం సృష్టించిన రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణి సేన అధినేత సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం అర్ధరాత్రి ఛండీగఢ్‌లో హత్యలో పాల్గొన్న ఇద్దరు షూటర్లు, వారికి సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

జైపూర్: రాజస్థాన్‌లో సంచలనం సృష్టించిన రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణి సేన అధినేత సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం అర్ధరాత్రి ఛండీగఢ్‌లో హత్యలో పాల్గొన్న ఇద్దరు షూటర్లు, వారికి సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జాయింట్ ఆపరేషన్‌లో భాగంగా ఇతరులు అందించిన సమాచారం మేరకు ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ బృందం, రాజస్థాన్ పోలీసులు కలిసి నిందితులను అరెస్ట్ చేశారు. ఇద్దరు హంతకులు రాజస్థాన్‌లోని జైపూర్ నివాసి అయినా రోహిత్ రాథోడ్, హర్యానాలోని మహేంద్రగఢ్ నివాసి అయిన నితిన్ ఫౌజీగా పోలీసులు నిర్ధారించారు. వీరికి సహకరించిన మూడో వ్యక్తి పేరు ఉధమ్ సింగ్‌గా పోలీసులు గుర్తించారు. రోహిత్, ఉధమ్‌లను పోలీసులు ఢిల్లీకి తీసుకెళ్లారు. నితిన్ ఫౌజీ మాత్రం రాజస్థాన్ పోలీసుల అదుపులోనే ఉన్నాడు. కాగా నిందితులను పట్టుకునేందుకు సమాచారం ఇచ్చిన వారికి రూ.5 లక్షల నగదు బహుమతి ఇస్తామని పోలీసులు ప్రకటించిన సంగతి తెలిసిందే.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హత్య చేసిన తర్వాత నిందితులు తమ ఆయుధాలను దాచిపెట్టి రాజస్థాన్ నుంచి హర్యానాలోని హిసార్ చేరుకున్నారు. తర్వాత హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలి వెళ్లారు. అనంతరం చండీగఢ్‌కు తిరిగొచ్చి పోలీసులకు దొరికిపోయారు. నిందితుల మొబైల్ ఫోన్ లోకేషన్‌ల ఆధారంగా పోలీసులు పట్టుకున్నారు. ఈ హత్య గురించి దర్యాప్తు చేసేందుకు ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) హెడ్, అడిషనల్ డైరెక్టర్ జనరల్ (క్రైమ్) దినేష్ ఎంఎన్ కూడా ముగ్గురు నిందితుల అరెస్ట్‌ను ధృవీకరించారు. నిందితులను సోమవారం కోర్టు ముందు హాజరుపరచనున్నట్టు కూడా తెలిపారు. కాగా ఈ హత్యకు సంబంధించి రామ్‌వీర్ అనే వ్యక్తిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు నలుగురు అరెస్ట్ అయ్యారు. గోగమేడిని హత్య చేసేందుకు ముష్కరులతో ఒప్పందం కుదుర్చుకున్నారనే ఆరోపణలతో జైపూర్‌లో రామ్‌వీర్ జాట్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు కుట్రదారుల్లో ఒకరైన రామ్‌వీర్ హత్యకు ముందు జైపూర్‌లో అతని స్నేహితుడు ఫౌజీతో కలిసి గ్రౌండ్ వర్క్‌ను సిద్ధం చేశాడు.

అసలు ఏం జరిగిందంటే.. జైపూర్‌లో ఈనెల 5న సుఖ్‌దేవ్ సింగ్ గోగమేది తన ఇంట్లో నలుగురు వ్యక్తులతో కలిసి టీ తాగుతూ ముచ్చటిస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఇద్దరు వ్యక్తులు ఆయనపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దాంతో ఆయన రక్తపుమడుగులో అచేతనంగా పడిపోయారు. క్రాస్‌ఫైర్ సమయంలో మరణించిన మూడో షూటర్‌ను నవీన్ సింగ్ షెకావత్‌గా పోలీసులు గుర్తించారు. ఈ కాల్పుల్లో గోగమేది బాడీగార్డ్ సైతం తీవ్రంగా గాయపడ్డాడు. కాగా, ఈ హత్య తమ పనేనని గోల్డీ బ్రార్, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌లతో సంబంధం ఉన్న గ్యాంగ్‌స్టర్ రోహిత్ గోదారా ప్రకటించాడు. రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి, అధికార మార్పడి జరగాల్సి ఉన్న తరుణంలో కర్ణిసేన చీఫ్ దారుణహత్యకు గురికావడం తీవ్ర సంచలనమైంది.

Updated Date - 2023-12-10T08:33:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising