ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Odisha train accident : ఒడిశా రైలు ప్రమాదం నుంచి బయటపడినవారి కోసం ప్రత్యేక రైలు.. చెన్నైకి 250 మంది ప్రయాణికులు..

ABN, First Publish Date - 2023-06-03T16:02:56+05:30

ఒడిశాలో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడినవారిలో 250 మంది ప్రత్యేక రైలులో తమ గమ్యస్థానాలకు బయల్దేరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ : ఒడిశాలో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడినవారిలో 250 మంది ప్రత్యేక రైలులో తమ గమ్యస్థానాలకు బయల్దేరారు. వీరిలో అత్యధికులు చెన్నైకు చెందినవారు. ఈ ప్రత్యేక రైలు పీ/13671 భద్రక్ నుంచి చెన్నైకు బయల్దేరింది. ఇది విజయవాడకు శనివారం రాత్రి 9.30 గంటలకు చేరుకుంటుంది. ఈ వివరాలను రైల్వే అధికారి ఒకరు మీడియాకు తెలిపారు.

దక్షిణ మధ్య రైల్వే జోన్ విజయవాడ రైల్వే డివిజన్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం, ఈ ప్రత్యేక రైలులో ప్రయాణిస్తున్నవారిలో నలుగురు బరంపురంలో, 41 మంది విశాఖపట్నంలో, ఒకరు రాజమహేంద్రవరంలో, ఇద్దరు తాడేపల్లి గూడెంలో, 133 మంది చెన్నైలో దిగుతారు. ఈ రైలు ఆదివారం చెన్నై చేరుకుంటుంది.

భారతీయ రైల్వేలు వెల్లడించిన వివరాల ప్రకారం, పశ్చిమ బెంగాల్‌లోని షాలిమార్ నుంచి బయల్దేరిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో ఆంధ్ర ప్రదేశ్‌కు చెందినవారు 178 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రైలు చెన్నై వెళ్లవలసి ఉండగా, శుక్రవారం ఈ ప్రమాదం జరిగింది. ఈ 178 మందిలో 110 మంది విశాఖపట్నంలో, 26 మంది రాజమహేంద్రవరంలో, ఒకరు తాడేపల్లి గూడెంలో, ఇద్దరు ఏలూరులో, 39 మంది విజయవాడలో దిగవలసి ఉంది.

భద్రతకు పెద్ద పీట : కాంగ్రెస్

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ (Jairam Ramesh) శనివారం ఇచ్చిన ట్వీట్‌లో, ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం అత్యంత భయానకమైనదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది అత్యంత విషాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రైల్ నెట్‌వర్క్ కార్యకలాపాల్లో నిరంతరం భద్రతకు పెద్ద పీట వేయవలసిన అవసరం చాలా ఉందనే వాదనను ఈ ప్రమాదం మరింత బలోపేతం చేస్తోందని చెప్పారు. లేవనెత్తవలసిన అవసరం ఉన్న సమంజసమైన ప్రశ్నలు అనేకం ఉన్నాయని, అయితే ఆదివారం వరకు వేచి చూద్దామని అన్నారు.

ఒడిశాలోని బాలాసోర్ జిల్లా, బహనగ బజార్ స్టేషన్ సమీపంలో శుక్రవారం సాయంత్రం 6.55 గంటల నుంచి 7 గంటల మధ్యలో ఈ దారుణం జరిగింది. మొదట షాలిమార్-చెన్నై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పినట్లు తెలుస్తోంది. ఈ రైలు బోగీలు పక్కనే ఉన్న పట్టాలపైనా, పార్క్ చేసి ఉన్న ఓ గూడ్స్ రైలుపైనా పడ్డాయని, ఆ తర్వాత బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌పై పడ్డాయని, ఇదంతా కేవలం 30 సెకండ్ల వ్యవధిలోనే జరిగిందని చెప్తున్నారు. కోల్‌కతాకు దక్షిణ దిశలో 250 కిలోమీటర్ల దూరంలో, భువనేశ్వర్‌కు ఉత్తర దిశలో 170 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడానికి కారణాలేమిటో ఇంత వరకు తెలియడం లేదు. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య 278కి చేరిందని, గాయపడినవారి సంఖ్య 900 దాటిందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి :

Odisha Train Accidnt : రైలు ప్రమాదం కారణంగా నేడు, రేపు రద్దైన రైళ్లు ఏవంటే...

Odisha Train Accident : అత్యంత విషాదకర రైలు ప్రమాదం.. సంతాప దినాలు ప్రకటించిన తమిళనాడు, ఒడిశా ప్రభుత్వాలు..

Updated Date - 2023-06-03T16:02:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising