ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Manish Sisodia arrest: అరవింద్ కేజ్రీవాల్ ముందు సవాళ్లు

ABN, First Publish Date - 2023-02-27T12:56:54+05:30

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేయడంతో ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు పలు సవాళ్లు ఎదురయ్యాయి...

Challenges before Arvind Kejriwal
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేయడంతో ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు పలు సవాళ్లు ఎదురయ్యాయి.(Manish Sisodia arrest)ఆప్ అభివృద్ధి ప్రణాళికలకు సిసోడియా అరెస్టుతో ఆటంకం కలిగే అవకాశం ఉంది.(Immediate challenges)గత ఏడాది ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ అరెస్ట్ తర్వాత అవినీతి ఆరోపణలపై అరెస్టయిన రెండవ ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నాయకుడు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా. సిసోడియా సీఎం కేజ్రీవాల్ కు(before Arvind Kejriwal) అత్యంత విశ్వసనీయమైన వ్యక్తి. ఆప్ ను దేశవ్యాప్తంగా విస్తరించాలనే కేజ్రీవాల్ యోచనకు సిసోడియా అరెస్టుతో ఎదురుదెబ్బ తగిలినట్లయింది.(Challenges before Arvind Kejriwal)

ఢిల్లీలో సిసోడియా ప్రవేశపెట్టిన విద్యావిధానం దేశ వ్యాప్తంగా పేరొందింది. సిసోడియా 18 శాఖలను పర్యవేక్షించే వారు. గత ఏడాది సత్యేందర్ జైన్ అరెస్టుతో ఢిల్లీ ప్రభుత్వంలో విద్యా, ఆరోగ్యంతో పాటు 18 కీలక శాఖలను సిసోడియా పర్యవేక్షించేవారు. వీటన్నింటికంటే పెద్ద ఎదురుదెబ్బ విద్యాశాఖలో కనిపిస్తోంది. భారతదేశపు ఉత్తమ విద్యామంత్రిగా సిసోడియాను ఆప్ అభివర్ణించింది. షెడ్యూల్ ప్రకారం ఢిల్లీ ప్రభుత్వ బడ్జెట్ ను సమర్పించడం సీఎం కేజ్రీవాల్ ముందున్న సవాలు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఢిల్లీ ప్రభుత్వ బడ్జెట్‌ను రెవెన్యూశాఖ మంత్రి కైలాష్ గహ్లోట్ సమర్పించే అవకాశాలున్నాయి.2014లో ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి సిసోడియా బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు.ఢిల్లీ ప్రభుత్వ వెబ్‌సైట్ ప్రకారం, మొత్తం 33 విభాగాలు ఉన్నాయి. వీరిలో ఆరోగ్యం, విద్య, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (పిడబ్ల్యుడి), సేవలు, ఆర్థికం, విద్యుత్, గృహ, పట్టణాభివృద్ధితో సహా 18 శాఖలను సిసోడియా చూసేవారు. ప్రత్యేకంగా ఏ మంత్రికి కేటాయించని శాఖలన్నింటిని కూడా ఆయనే నిర్వహిస్తున్నారు.మనీలాండరింగ్ కేసులో జైన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గతేడాది అరెస్టు చేసింది.పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్‌కు కేవలం మూడు శాఖలు మాత్రమే ఉన్నాయి.ఇమ్రాన్ హుస్సేన్ ఆహారం, పౌర సరఫరాలు, ఎన్నికల అనే రెండు శాఖలకు మాత్రమే ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు.గెహ్లాట్ రెవెన్యూ, రవాణాతో సహా ఆరు విభాగాలకు ఇన్‌ఛార్జ్‌గా ఉండగా, రాజ్ కుమార్ ఆనంద్‌కు నాలుగు పోర్ట్‌ఫోలియోలు ఉన్నాయి.

ఇది కూడా చదవండి : Kerala temple: దేశంలోనే మొట్టమొదటి సారి దేవాలయంలో పూజల కోసం యాంత్రిక ఏనుగు

ఢిల్లీ తర్వాత పంజాబ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత, ఇప్పుడు కేజ్రీవాల్ ఇతర రాష్ట్రాల్లో ఆప్ ను విస్తరించాలని చూస్తున్నారు. ఇటీవల జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఐదు స్థానాల్లో విజయం సాధించింది. వచ్చే నెలలో కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లలో పర్యటించేందుకు కేజ్రీవాల్‌ కూడా సిద్ధమవుతున్నట్లు సమాచారం.8 గంటల విచారణ తర్వాత 2021-22కి సంబంధించి ఇప్పుడు రద్దు చేసిన ఎక్సైజ్ పాలసీ రూపకల్పన అమలులో అవినీతి ఆరోపణలకు సంబంధించి కేజ్రీవాల్‌కు సన్నిహితుడైన సిసోడియాను ఆదివారం సాయంత్రం సీబీఐ అరెస్టు చేసింది.గతేడాది ఆగస్టు 17వతేదీన సీబీఐ కేసు నమోదు చేసిన తర్వాత సిసోడియాను ప్రశ్నించడం ఇది రెండో దఫా. గతేడాది అక్టోబరు 17వతేదీన సిసోడియాను విచారించారు. తన డిప్యూటీ సీఎం నిర్దోషి అని కేజ్రీవాల్ నొక్కి చెప్పారు.‘‘మనీష్ నిర్దోషి. అతని అరెస్టు నీచ రాజకీయం. ఇది ప్రజలకు చాలా కోపం తెప్పించింది. ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. దీనికి సమాధానం ఇస్తారు. ఇది మా స్ఫూర్తిని పెంచుతుంది,మా పోరాటం మరింత బలపడుతుంది’’ అని కేజ్రీవాల్ హిందీలో ట్వీట్ చేశారు.

Updated Date - 2023-02-27T12:56:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising