ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Uniform Civil Code : యూసీసీపై మోదీ వ్యాఖ్యలతో ముస్లిం లా బోర్డ్ అర్ధరాత్రి అత్యవసర భేటీ

ABN, First Publish Date - 2023-06-28T13:48:06+05:30

దేశంలో ఉమ్మడి పౌర స్మృతి (Uniform Civil Code -UCC)పై చర్చ ఊపందుకుంటోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) మంగళవారం భోపాల్ నుంచి దీనిపై మాట్లాడటంతో, ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ (AIMPLB) అర్ధరాత్రి అత్యవసరంగా సమావేశమైంది.

Narendra Modi
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : దేశంలో ఉమ్మడి పౌర స్మృతి (Uniform Civil Code -UCC)పై చర్చ ఊపందుకుంటోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) మంగళవారం భోపాల్ నుంచి దీనిపై మాట్లాడటంతో, ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ (AIMPLB) అర్ధరాత్రి అత్యవసరంగా సమావేశమైంది. యూసీసీ వల్ల ఎదురయ్యే చట్టపరమైన అంశాల గురించి చర్చించింది. దీనిని వ్యతిరేకిస్తూ శాసన పరిశీలన సంఘం (Law Commission) సమక్షంలో వాదనలు వినిపించాలని నిర్ణయించింది. అదేవిధంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి, తమ వాదనను వినిపించాలని నిర్ణయించింది.

మధ్య ప్రదేశ్‌లోని భోపాల్‌లో బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో మోదీ మంగళవారం ఓ ప్రశ్నకు సమాధానం చెప్తూ, ప్రతిపక్ష పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. దేశ ప్రజలందరికీ ఒకే చట్టం అమలుకావాలన్నారు. దీనిపై కాంగ్రెస్, డీఎంకే, ఏఐఎంఐఎం ఘాటుగా స్పందించాయి. మోదీ విభజన రాజకీయాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టాయి. ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే మోదీ యూసీసీని ప్రస్తావిస్తున్నారని మండిపడ్డాయి.

ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సమావేశం వర్చువల్ విధానంలో జరిగింది. దాదాపు మూడు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో యూసీసీని వ్యతిరేకించాలని నిర్ణయించారు. బీజేపీ మేనిఫెస్టోలలో ఇచ్చిన హామీల్లో ఒకటైన యూసీసీపై తమ వాదనను, న్యాయవాదులు, నిపుణులు వ్యక్తం చేసిన అభిప్రాయాలను లా కమిషన్‌కు సమర్పించాలని నిర్ణయించారు.

వివాహం, విడాకులు, వారసత్వం, పిల్లల దత్తత వంటి అంశాల్లో దేశ ప్రజలందరికీ సమాన హక్కులు, నిబంధనలు అమల్లో ఉండాలని బీజేపీ చెప్తోంది. ఇప్పటి వరకు వేర్వేరు మతస్థుల కోసం వేర్వేరు చట్టాలు అమలవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)ని అమలు చేయడానికి ప్రయత్నించాలని భారత రాజ్యాంగంలోని అధికరణ 44 చెప్తోంది. యూసీసీపై అభిప్రాయాలను తెలపాలని లా కమిషన్ ఇటీవలే ఓ నోటిఫికేషన్ ఇచ్చింది. మత సంస్థలు, వ్యక్తులు తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చునని తెలిపింది.

ఇవి కూడా చదవండి :

Rajya Sabha polls : మూడు రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు జూలైలో

UCC Vs Congress : ఉమ్మడి పౌర స్మృతిపై చిదంబరం ఘాటు వ్యాఖ్యలు

Updated Date - 2023-06-28T13:48:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising