ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Maharashtra : శరద్ పవార్‌కు గట్టి ఝలక్ ఇచ్చిన అజిత్ పవార్.. ప్రమాణ స్వీకారానికి అంతా సిద్ధం

ABN, First Publish Date - 2023-07-02T13:59:39+05:30

మరాఠా రాజకీయ దిగ్గజం శరద్ పవార్‌కు ఆయన సమీప బంధువు అజిత్ పవార్ గట్టి ఝలక్ ఇచ్చినట్లు జాతీయ మీడియా కథనాలనుబట్టి తెలుస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : మరాఠా రాజకీయ దిగ్గజం శరద్ పవార్‌కు ఆయన సమీప బంధువు అజిత్ పవార్ గట్టి ఝలక్ ఇచ్చినట్లు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)లో చీలిక రాబోతోందని, అజిత్ పవార్ వర్గం ప్రస్తుతం మహారాష్ట్ర రాజ్ భవన్ వద్ద ఉందని సమాచారం. మొత్తం 30 మంది ఎమ్మెల్యేలను వెంటబెట్టుకొని రాజ్‌భవన్‌కు వెళ్లారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు అజిత్ పవార్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు సమాచారం. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కూడా రాజ్ భవన్‌కు చేరుకున్నట్లు తాజా సమాచారం.

కొద్ది రోజుల క్రితం అజిత్ పవార్ మహారాష్ట్ర శాసన సభలో ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలతో ఆదివారం ఆయన తన అధికార నివాసం దేవగిరిలో సమావేశమయ్యారు. ఎన్‌సీపీ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవి తనకు దక్కకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు తెలుస్తోంది. దీనిపై ఆ పార్టీ జాతీయ కార్యనిర్వాహక మండలి చర్చించి, రెండు నెలల్లోగా ఓ నిర్ణయం తీసుకుంటుందని ఆయనకు చెప్పినట్లు సమాచారం.

శరద్ పవార్ జూన్ 25న మాట్లాడుతూ, అజిత్ డిమాండ్‌పై పార్టీ చర్చించి, ఓ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. శరద్ పవార్ నేతృత్వంలో ఎన్‌సీపీ ఎమ్మెల్యేల సమావేశం జూలై 6న జరుగుతుందని అంతకుముందు ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి :

Manipur violence : మణిపూర్ హింసాకాండ వెనుక విదేశీ శక్తులు : సీఎం బిరేన్ సింగ్

Pakistan : భారత్‌లో విధ్వంసం సృష్టించడానికి పాకిస్థాన్ కొత్త వ్యూహాలు

Updated Date - 2023-07-02T14:05:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising