ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Odisha train accident : ఒడిశా రైలు ప్రమాదంపై కాంగ్రెస్ స్పందన

ABN, First Publish Date - 2023-06-03T15:21:40+05:30

ఒడిశాలో సంభవించిన ఘోర రైలు ప్రమాదంపై కాంగ్రెస్ స్పందించింది. రైల్ నెట్‌వర్క్ కార్యకలాపాల్లో నిరంతరం భద్రతకు పెద్ద పీట

Jairam Ramesh, Congress
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఒడిశాలో సంభవించిన ఘోర రైలు ప్రమాదంపై కాంగ్రెస్ స్పందించింది. రైల్ నెట్‌వర్క్ కార్యకలాపాల్లో నిరంతరం భద్రతకు పెద్ద పీట వేయవలసిన అవసరం చాలా ఉందనే వాదనను ఈ ప్రమాదం మరింత బలోపేతం చేస్తోందని తెలిపింది. లేవనెత్తదగిన సమంజసమైన ప్రశ్నలు అనేకం ఉన్నాయని తెలిపింది. బాలాసోర్ సమీపంలో శుక్రవారం రాత్రి బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు ప్రమాదంలో చిక్కుకోవడంతో దాదాపు 278 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 900 మంది గాయపడ్డారు.

ఒడిశాలోని బాలాసోర్ జిల్లా, బహనగర్ బజార్ స్టేషన్ సమీపంలో శుక్రవారం సాయంత్రం 6.55 గంటల నుంచి 7 గంటల మధ్యలో ఈ దారుణం జరిగింది. మొదట షాలిమార్-చెన్నై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పినట్లు తెలుస్తోంది. ఈ రైలు బోగీలు పక్కనే ఉన్న పట్టాలపైనా, పార్క్ చేసి ఉన్న ఓ గూడ్స్ రైలుపైనా పడ్డాయని, ఆ తర్వాత బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌పై పడ్డాయని, ఇదంతా కేవలం 5 నిమిషాల వ్యవధిలోనే జరిగిందని చెప్తున్నారు. కోల్‌కతాకు దక్షిణ దిశలో 250 కిలోమీటర్ల దూరంలో, భువనేశ్వర్‌కు ఉత్తర దిశలో 170 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడానికి కారణాలేమిటో ఇంత వరకు తెలియడం లేదు. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య 278కి చేరిందని, గాయపడినవారి సంఖ్య 900 దాటిందని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ (Jairam Ramesh) శనివారం ఇచ్చిన ట్వీట్‌లో, ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం అత్యంత భయానకమైనదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది అత్యంత విషాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రైల్ నెట్‌వర్క్ కార్యకలాపాల్లో నిరంతరం భద్రతకు పెద్ద పీట వేయవలసిన అవసరం చాలా ఉందనే వాదనను ఈ ప్రమాదం మరింత బలోపేతం చేస్తోందని చెప్పారు. లేవనెత్తవలసిన అవసరం ఉన్న సమంజసమైన ప్రశ్నలు అనేకం ఉన్నాయని, అయితే ఆదివారం వరకు వేచి చూద్దామని అన్నారు.

ఈ విషాదకర సంఘటన పట్ల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని పార్టీ కార్యకర్తలను కోరారు.

ఇవి కూడా చదవండి :

Odisha Train Accidnt : రైలు ప్రమాదం కారణంగా నేడు, రేపు రద్దైన రైళ్లు ఏవంటే...

Odisha Train Accident : అత్యంత విషాదకర రైలు ప్రమాదం.. సంతాప దినాలు ప్రకటించిన తమిళనాడు, ఒడిశా ప్రభుత్వాలు..

Updated Date - 2023-06-03T15:21:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising