ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Gujarat ATM Case: ఏటీఎం కార్డు గీకాడు.. జైల్లో వచ్చి పడ్డాడు.. అసలేమైందంటే?

ABN, First Publish Date - 2023-07-27T21:15:52+05:30

ఏంటీ.. కేవలం ఏటీఎం కార్డు గీకినందుకు జైల్లో వేశారా? అని టైటిల్ చూసి అనుకుంటున్నారా! ఆగండి, ఆగండి, తొందర పడకండి.. ఇక్కడ అసలు మేటర్ వేరే ఉంది..

ఏంటీ.. కేవలం ఏటీఎం కార్డు గీకినందుకు జైల్లో వేశారా? అని టైటిల్ చూసి అనుకుంటున్నారా! ఆగండి, ఆగండి, తొందర పడకండి.. ఇక్కడ అసలు మేటర్ వేరే ఉంది. ఈ స్టోరీలో ఎవరైతే ఏటీఎం కార్డు గీకాడో, అతడు ఒక అత్యాచార నిందితుడు. ఒక మహిళపై అత్యాచారం చేసిన తర్వాత అతడు మాయమైపోయాడు. ఈ నిందితుడి కోసం దాదాపు నెల రోజుల నుంచి పోలీసులు గాలిస్తు్న్నారు. ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. కానీ.. నెల రోజుల తర్వాత అతడు ఓ ఏటీఎం సెంటర్‌లో డబ్బులు తీశాడు. ఆ ట్రాన్సాక్షనే అతడ్ని అడ్డంగా పట్టించింది. ఆ వివరాల్లోకి వెళ్తే..

ముంబైలోని మరీన్ లైన్స్‌కు చెందిన ఇసాక్ మర్చంట్‌కు కొన్ని సంవత్సరాల క్రితం సోషల్ మీడియా ద్వారా ఓ యువతి పరిచయం అయ్యింది. అప్పటి నుంచి చాటింగ్ చేయడం మొదలుపెట్టిన వీళ్లిద్దరూ.. క్రమంగా దగ్గరయ్యారు. అనుకోకుండానే ప్రేమలో పడ్డారు. పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో.. ఇద్దరూ సహజీవనం చేయడం ప్రారంభించారు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. ఇసాక్‌కు ఆల్రెడీ పెళ్లయ్యింది. కానీ.. ఈ విషయం సహజీవనం చేస్తున్న మహిళకు తెలియదు. పెళ్లి చేసుకుంటానని ఆమెని నమ్మించి.. గత 7-8 సంవత్సరాల నుంచి ఆమెని శారీరకంగా అనుభవిస్తూ వచ్చాడు. పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చినా ప్రతీసారి.. ఏదో సాకు చెప్తూ దాటవేస్తూ వచ్చాడు. ఒకసారి.. తాను ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నానని, అది ప్రారంభించిన వెంటనే పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. దాంతో ఆమె సైలెంట్ అయ్యింది.


అయితే.. రీసెంట్‌గా ఆమె మరోసారి పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చింది. తనని పెళ్లి చేసుకుంటావా? లేదా? అని గట్టిగా నిలదీసింది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య వాగ్వాదం నెలకొనగా.. తన ఇంటి నుంచి వెళ్లిపోవాలని ఇసాక్ ఆమెకి చెప్పాడు. కానీ, తనే ఇల్లు వదిలి పారిపోయాడు. తాను మోసపోయానని గ్రహించిన ఆ మహిళ.. పోలీసుల్ని ఆశ్రయించింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే.. ఇసాక్ ఫోన్ స్విచ్చాఫ్‌గా వస్తుండటంతో, అతని లొకేషన్‌ని పసిగట్టలేకపోయారు. చివరికి.. గుజరాత్‌లోని నార్గోల్ గ్రామంలో ఉంటున్న అతని భార్య ఇంటికి కూడా వెళ్లి విచారించారు. అక్కడ కూడా పోలీసులకు నిరాశే ఎదురైంది. చూస్తుండగానే నెల రోజులు గడిచిపోయాయి.

కట్ చేస్తే.. నెల రోజుల తర్వాత ఇసాక్ మర్చంట్ గుజరాత్‌లోని ఒక ఏటీఎంలో కొంత డబ్బు తీశాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. అతడు పరిసర ప్రాంతాల్లోనే ఏదో ఒక లాడ్జ్‌లో ఉంటాడని భావించి, సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ఫైనల్‌గా ఓ లాడ్జ్‌లో ఉన్నాడన్న సంగతి తెలిసింది కానీ, పోలీసులు అక్కడికి చేరుకునేలోపే అతడు పరారయ్యాడు. అరగంట తర్వాత మరో నంబర్‌తో తన ఫోన్‌ని ఇసాక్ ఆన్ చేయగానే.. పోలీసులకి క్లూ దొరికింది. వాపిలో ఒక లాడ్జ్‌లో తలదాచుకున్నాడన్న సంగతి తెలిసి.. నేరుగా అక్కడికి వెళ్లి, అతడ్ని అరెస్ట్ చేశారు. పెళ్లి పేరుతో మహిళపై అత్యాచారం చేసినందుకు.. అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, జుడీషియల్ కస్టడీకి పంపారు.

Updated Date - 2023-07-27T21:15:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising