ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rahul Gandhi : రాహుల్ గాంధీపై కోర్టు తీర్పు... బిహార్ శాసన సభలో నిరసన...

ABN, First Publish Date - 2023-03-24T18:19:30+05:30

పరువు నష్టం కేసు (defamation case)లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Congress leader Rahul Gandhi)ని దోషిగా గుజరాత్ కోర్టు

Bihar Assembly Premises
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పాట్నా : పరువు నష్టం కేసు (defamation case)లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Congress leader Rahul Gandhi)ని దోషిగా గుజరాత్ కోర్టు తీర్పు చెప్పడంపై బిహార్‌లో నిరసన వ్యక్తమైంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మహా కూటమిలోని జేడీయూ మినహా మిగిలిన పార్టీల ఎమ్మెల్యేలు శుక్రవారం శాసన సభ ప్రాంగణంలో నిరసన ప్రదర్శన చేశారు. ఆర్జేడీ, కాంగ్రెస్, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్, సీపీఐ, సీపీఎం, హెచ్ఏఎం పార్టీల సభ్యులు ఈ నిరసనలో పాల్గొన్నారు.

ఈ పార్టీల ఎమ్మెల్యేలు శాసన సభ ప్రధాన ద్వారం వద్ద తమ వాహనాల నుంచి క్రిందకు దిగి, శాసన సభ వైపు నడుస్తూ వెళ్లారు. ‘మోదీని గద్దె దించండి, దేశాన్ని కాపాడండి’ అని నినాదాలు చేశారు.

బిహార్ మాజీ ముఖ్యమంత్రి జీతన్ రామ్ మాంఝీ (Jitan Ram Manjhi) మాట్లాడుతూ, కోర్టు తన తీర్పును పునఃపరిశీలించాలన్నారు. కర్ణాటకలో రాహుల్ గాంధీ మాట్లాడినపుడు ఫలానా వ్యక్తికి వ్యతిరేకంగా మాట్లడలేదని, ఫలానా వ్యక్తిని కించపరచలేదని అన్నారు. న్యాయ వ్యవస్థపై ఆరోపణలు చేయాలని తాను అనుకోవడం లేదన్నారు. ఇంతకన్నా దారుణమైన వ్యాఖ్యలు చేసినవారు తప్పించుకు తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు.

ఈ ఎమ్మెల్యేలు సభలో కూడా నినాదాలు చేయడంతో సభాపతి అవధ్ బిహారీ చౌదరి మాట్లాడుతూ, కూటమి తరపున స్టేట్‌మెంట్ ఇవ్వాలని సీపీఐఎంఎల్ లిబరేషన్ ఎమ్మెల్యే మహబూబ్ ఆలంను కోరారు. ఆలం స్పందిస్తూ, మోదీ హటావో, దేశ్ బచావో అని నినదించారు. దీంతో బీజేపీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, తమ నిరసనను తెలిపారు.

అనంతరం సభాపతి మాట్లాడుతూ సభ్యుల వద్ద ఉన్న బ్యానర్లు, ప్లకార్డులు, పోస్టర్లను తీసుకోవాలని మార్షల్స్‌ను ఆదేశించారు. జేడీయూ వైఖరి గురించి ప్రశ్నించినపుడు ఆ పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి నీరజ్ కుమార్ మాట్లాడుతూ, తమకు భిన్నాభిప్రాయం ఉందని తుది నిర్ణయానికి రావడం తప్పు అని చెప్పారు. దీనివల్ల మహా కూటమిలో సమస్య ఉందని భావించడం తప్పు అన్నారు.

దొంగలందరికీ ఇంటి పేరు (surname) మోదీ (Modi) అని ఉందంటూ వ్యాఖ్యానించి, రెండేళ్ల జైలుశిక్ష పొందిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Congress MP Rahul Gandhi)పై అనర్హత(disqualification) వేటు పడటంపై ఆ పార్టీ నేతలతో పాటు ఇతర పార్టీల నాయకులు కూడా మండిపడుతున్నారు.

ఇవి కూడా చదవండి :

CAG Report : ఏపీ ప్రభుత్వ అప్పులు ఎన్ని లక్షల కోట్లో తెలిస్తే..

World TB Summit : క్షయ వ్యాధిపై సదస్సులో మోదీ సంచలన వ్యాఖ్యలు

Updated Date - 2023-03-24T18:19:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising